టెక్ రంగంలో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పని గంటలు ఎక్కవ కావడంతో ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. చాలా మంది ఉద్యోగులు ఈ ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు అయితే కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. చాలామంది కంపెనీని ఓ పని ఒత్తిడి గురించి ప్రశ్నిస్తున్నారు.
అయితే వారి ప్రశ్నించగానే కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్నాయి.తాజాగా హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి ఇలాంటి అనుభమే ఎదురయింది. ఇప్పుడు హైదరాబాద్‌లో పనిచేసిన ఒక మాజీ ఎంఎన్‌సీ ఉద్యోగి వ్యవహారం ఈ సమస్యను మరింత స్పష్టంగా బయటపెట్టింది.
అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థలో సుమారు 14 ఏళ్ల పాటు పనిచేసిన ఓ ఐటీ నిపుణుడు.. రోజుకు సగటున 16 Hours పైగా పనిచేయాల్సి వస్తోందని అధికారికంగా ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఉద్యోగం నుంచి కంపెనీ తొలగించింది. కంపెనీ తనను అన్యాయంగా తొలగించిందని ఆరోపిస్తూ ఆ ఉద్యోగి.. కార్మిక చట్టాల ఉల్లంఘనపై చట్టపరమైన పోరాటానికి దిగాడు.

ఆ మాజీ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం.. వనరుల కొరత పేరుతో నెలల తరబడి అధిక పని భారం మోపారని, అదనపు గంటలకు చెల్లించాల్సిన ఓవర్‌టైం వేతనం ఇవ్వలేదని అన్నారు. శారీరకంగా, మానసికంగా రోజుకు ఇన్ని గంటలు పని చేయడం అసాధ్యం. కంపెనీలు క్లయింట్ల నుంచి గంటల ప్రాతిపదికన బిల్లులు వసూలు చేస్తున్నప్పుడు.. ఉద్యోగులకు ఎందుకు అదే విధంగా జీతం ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు.
ఈ సమస్యపై సంస్థ అంతర్గతంగా స్పందన లభించకపోవడంతో.. మొదట జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన ఆ ఉద్యోగి, అనంతరం తెలంగాణ కార్మిక శాఖకు అధికారిక ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా.. సమస్యను లేవనెత్తిన వారంలోపే ఉద్యోగం నుంచి తొలగించడం తనను మరింత కలిచివేసిందని ఆయన ఆవేదన చెందారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని ఆరోపించారు.
తాను అనారోగ్యంతో ఉన్న రోజుల్లో కూడా పని చేయమని ఒత్తిడి తెచ్చారని, రాత్రి షిఫ్ట్‌లు, తెల్లవారుజామున షిఫ్ట్‌లకు రావాల్సిన అలవెన్సులు ఇవ్వలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఓవర్‌టైం బకాయిలు, వడ్డీ, జరిమానాల కోసం కంపెనీపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ సంఘటన పని-జీవిత సమతుల్యతపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల మధ్య మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో వారానికి 72 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలతో పని గంటలపై పెద్ద ఎత్తున వాదనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యువత ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న మరో ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ..మహమ్మారి తర్వాత జీతం లేకుండా వారాంతాల్లో, సెలవు రోజుల్లో పని చేయడం సాధారణమైపోయింది. మేనేజ్‌మెంట్ నుంచి టీమ్ లీడర్ల వరకు అందరికీ ఇది తెలుసు కానీ ఎవరూ ఎదురు మాట్లాడటం లేదని అన్నారు. బడ్జెట్ పరిమితులు, వనరుల కొరత పేరుతో ఉద్యోగులను అదనపు పనికి బలవంతం చేయడం, నిరాకరిస్తే ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసిన ఒరాకిల్.. లేఆప్స్ తరువాత స్టాక్ మార్కెట్లో పరుగులు పెట్టిన షేర్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications