పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం (జూలై 2) లీటర్ పెట్రోల్ పైన 33 నుండి 37 పైసలు పెరిగింది. అయితే డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. మొత్తానికి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 క్రాస్ చేసింది. సెంచరీ దాటిన వాటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, లడక్, బీహార్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.107.43కు చేరుకుంది. డీజిల్ రూ.97.93 వద్ద ఉంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పెట్రోల్ రూ.105.91, డీజిల్ రూ.98.29గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.105.13, డీజిల్ రూ.98.68గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.103.05, డీజిల్ రూ.97.20గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.102.48, డీజిల్ రూ.98.54, ముంబైలో పెట్రోల్ రూ.105.24, డీజిల్ రూ.96.72, పాట్నాలో పెట్రోల్ రూ.101.21, డీజిల్ రూ.94.52గా ఉంది. జమ్ము కాశ్మీర్‌లో పెట్రోల్ రూ.102.11, లడక్‌లో రూ.104.56గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. పెట్రోల్ రూ.99.16, డీజిల్ రూ.89.18గా ఉంది.

జూన్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 16సార్లు పెరిగాయి. ఒక్క జూన్ నెలలోనే రూ.4 వరకు పెట్రోల్ ధర పెరిగింది. మే 4వ తేదీ నుండి ధరలు చాలాసార్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం మన మార్కెట్ పైన పడింది. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ క్రూడ్ ఆయిల్ ఆగస్ట్ డెలివరీ 1.76 డాలర్లు ఎగిసి 75.23 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ సెప్టెంబర్ డెలివరీ 1.22 డాలర్లు పెరిగి 75.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications