బయటపడిన ఇన్సూరెన్స్ కంపెనీల బాగోతం.. స్కాంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు
GST evasion: ఇటీవల గుజరాత్ లో బయటపడిన GST రిజిస్ట్రేషన్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో వేలాదిమంది అక్రమంగా IT రిఫండ్ పొందినట్లు ఆదాయ శాఖ అధికారులు గుర్తించారు. తాజాగా మరో భారీ పన్ను ఎగవేతను గుర్తించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(DGGI) ప్రకటించింది.
దేశంలో ఆపరేట్ చేయబడుతున్న 30 బీమా కంపెనీలపై DGGI విచారణ జరుపుతోంది. వాటిలో 15 సంస్థల్లో ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసింది. అయితే ఇప్పటివరకు జరిపిన ఇన్వెస్టిగేషన్లో దాదాపు 3 వేల 500 కోట్ల మేర ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వ్యత్యాసాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మిగిలిన 15 కంపెనీలకు నోటీసులు పంపే పనిలో ఉంది.

HDFC లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియాన్జ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సహా 15 కంపెనీలు 2 వేల 350 కోట్లు GST ఎగవేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. వీటినుంచి 700 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపింది. ఈ అవకతవకల్లో ప్రభుత్వ రంగ భీమా సంస్థలు సైతం ఉన్నట్లు పేర్కొంది. అయితే వాటి పేరును మాత్రం వెల్లడించలేదు.
GST ఎగవేత విషయంలో దాదాపు 6 ఆన్లైన్ గేమ్ కంపెనీలపైన విచారణ జరుగుతున్నట్లు DGGI అధికారి ఒకరు తెలిపారు. ఇవికాక ఇప్పటివరకు సుమారు 11 వేల 140 అక్రమ GST రిజిస్ట్రేషన్స్ గుర్తించినట్లు, వాటిపై చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. మొత్తం 60 వేల ఎంటిటీలకు ఈ స్కాంలో భాగమైనట్లు చెప్పారు. తమ దర్యాప్తులో 15 వేల కోట్ల బోగస్ క్లైమ్స్ సైతం గుర్తించినట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications