Gold News: ఆంధ్రా గోల్డ్ మైన్స్ పై తాజా వార్త.. మెుత్తం 10 బంగారు గనులు.. ఈ నెలాఖరు నాటికి..

Gold News: దేశంలో ఎక్కువగా బంగారం గనులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశం కూడా ఒకటి. అయితే తాజాగా ఇక్కడ ఉన్న 10 మైన్స్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని గోల్డ్ మైన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే..

 రెండు రాష్ట్రాల్లో బంగారం గనులు..

రెండు రాష్ట్రాల్లో బంగారం గనులు..

దేశ GDPకి మైనింగ్ రంగం సహకారం అందించడానికి చేస్తున్న ప్రయత్నాల మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 బంగారు గనులను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 10 బ్లాకుల్లో, ఐదు బ్లాకుల వేలం ఆగస్టు 26న జరగవచ్చని, మిగిలిన ఐదు బ్లాకులను ఆగస్టు 29న ఉంచే అవకాశం ఉందని ప్రభుత్వ తాజా సమాచారమని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ బ్రాక్స్ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ బ్రాక్స్ వివరాలు..

ఆంధ్ర ప్రదేశ్‌లోని బంగారు గనుల్లో రామగిరి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, జవాకుల-ఎ బ్లాక్, జవాకుల-బి బ్లాక్, జవాకుల-సి బ్లాక్, జవాకుల-డి బ్లాక్, జవాకుల-ఇ బ్లాక్, జవాకుల-ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. అయితే.. ఈ బంగారు గనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తూ మార్చిలో నోటీసులు వెలువడ్డాయి.

ఉత్తర్ ప్రదేశ్ గనులకు..

ఉత్తర్ ప్రదేశ్ గనులకు..

ఉత్తరప్రదేశ్‌లో మిగిలిన మూడు బంగారు గనుల విషయంలో ఈ నెలలో వేలం జరగనుంది. కానీ నిర్దిష్ట తేదీలు ఇంకా ప్రకటించలేదు. రాష్ట్రంలోని మూడు గనులలో రెండు సోనపహరి బ్లాక్, ధుర్వ-బియాదండ్ బ్లాక్- సోన్‌భద్రలో ఉన్నాయి. ఈ మూడు బంగారు గనుల టెండర్లకు ఆహ్వానిస్తూ మే 21న నోటీసులు జారీ అయ్యాయి.

చట్ట సవరణతో వేగం..

చట్ట సవరణతో వేగం..

దేశంలోని రాష్ట్రాలు ఆగస్టు 4 నాటికి 199 మినరల్ బ్లాక్‌లను వేలం వేశాయి. 2015లో మైనింగ్ చట్టంలో సవరణల తర్వాత వేలం మార్గం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్ బ్లాక్‌లను అమ్మకానికి పెట్టడం జరిగింది. గనుల వేలం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ఆదాయాన్ని పొందుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు దీని వల్ల నిజంగా సంతోషంలో ఉన్నాయని తెలుస్తోంది.

గనుల మంత్రిత్వ శాఖ ఇలా..

గనుల మంత్రిత్వ శాఖ ఇలా..

ఖనిజాల వేలం నిబంధనల్లో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, తద్వారా బ్లాక్‌ల విక్రయంలో మరింత భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని గనుల మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. రాష్ట్రాలు, పరిశ్రమ సంఘాలు, మైనింగ్ కంపెనీలు, ఇతర వాటాదారులు, సాధారణ ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత సవరణ నియమాలు రూపొందినట్లు తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+