Sahara Group: దేశంలో సహారా ఇండియాలో గ్రూప్స్ లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కోట్లలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కష్టపడి సంపాదించిన డబ్బును ఈ కంపెనీలో పెట్టిన పెట్టుబడిదారులలో మీరు కూడా ఉన్నట్లయితే.. ఈ వార్త మీకోసమే. సహారా గ్రూప్‌లోని వివిధ యూనిట్లలో రూ.1.12 లక్షల కోట్ల విలువైన ప్రజల సొమ్ము ఉంది. ఈ డబ్బును కోట్ల మంది సామాన్యుల నుంచి పెట్టుబడుల రూపంలో సేకరించినట్లు, వారందరూ ఇందులో చిక్కుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

13 కోట్ల మంది ఇన్వెస్టర్లు..
సహారా గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో అధిక మంది చిన్న మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. అయితే మెుత్తం 13 కోట్ల మంది ఇన్వెస్టర్లకు చెందిన దాదాపు రూ.1.12 లక్షల కోట్లు ప్రస్తుతం చిక్కుకుపోయాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు SEBI.. సహారా కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ బిఎన్ అగర్వాల్‌తో సంప్రదింపులు జరిపామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సహారా గ్రూప్.. 'సెబీ సహారా రిఫండ్' అకౌంట్ లో రూ.25,781కు గాను కేవలం రూ.15,507 కోట్లును మాత్రమే ఇప్పటి వరకు డిపాజిట్ చేసింది.

సహారా కంపెనీలపై సెబీ జరిమానా..
సహారా గ్రూప్ సహారా కమోడిటీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన రెండు కంపెనీలపై ఇటీవల సెబీ జరిమానా విధించింది. సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సుబ్రతా రాయ్‌తో పాటు మరో ముగ్గురికి రూ.12 కోట్ల జరిమానాను విధించింది. 2008, 2009లో స్వచ్ఛందంగా పూర్తిగా కన్వర్టబుల్ డిబెంచర్ల జారీలో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించబడిందని తెలిసింది.

ఇన్వెస్టర్ల డబ్బు తిరిగి వస్తుందా..
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇన్వెస్టర్లు డబ్బును తిరిగి పొందేందుకు సంబంధించి గతంలో పలు ప్రకటనలు చేసింది. మధ్యతర ఆదేశాల కోరుతూ సెబీ 2021 దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సహారా గ్రూప్ కు చెందిన సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీలో రూ.47,245 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్లో రూ.6,381 కోట్లుతో పాటు సహాయా ఇండియన్ రియల్టీలో రూ.19,401 కోట్లు ఇరుక్కున్నాయి. వీటికి తోడు ఇతర గ్రూప్ కంపెనీల్లో దాదాపు రూ.39,428 కోట్ల డబ్బు బ్రాక్ అయింది. అయితే ఈ డబ్బు ఎప్పుడు వస్తుందా అని సామాన్యులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications