ఆటో డ్రైవర్ నుండి రూ. 900 కోట్ల బిజినెస్ వరకూ.. పెప్సీ, కోకాకోలాను వణికించిన 'బిందు' సత్య శంకర్!

వ్యాపార ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది రకరకాల సీక్రెట్ ఫార్ములాల కోసం వెతుకుతుంటారు. కానీ కర్ణాటకకు చెందిన సత్య శంకర్ విషయంలో ఆ ఫార్ములా ఎప్పుడూ ఒక రహస్యం కాదు. మన కళ్లముందే ఉన్న ఒక చిన్న ఐడియాను పట్టుకుని, ఆయన ఈరోజు దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. ఇదొక అద్భుతమైన సక్సెస్ స్టోరీ (success story).

1984లో సత్య శంకర్ ఒక కంపెనీకి సీఈఓ కాదు. ఆయన కేవలం 12వ తరగతి చదివి, ఇంట్లో డబ్బులు లేక చదువు ఆపేసిన ఒక 18 ఏళ్ల సాదాసీదా కుర్రాడు. తండ్రి ఒక చిన్న గ్రామంలో పూజారి. చదువు ఆగిపోయినా శంకర్ అధైర్యపడలేదు. పేదరికం నుండి బయటపడటానికి ఒక ప్రభుత్వ పథకం కింద లోన్ తీసుకుని ఆటోరిక్షా కొనడమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు.

12th Pass Auto Driver built Rs 900 Crore House of Bindu business Success story

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన లైఫ్

ఆటో నడుపుతూ కష్టపడి లోన్ తీర్చడమే కాకుండా.. కొన్నాళ్లకే ఆటోను అమ్మి ఒక అంబాసిడర్ కార్ కొని ట్యాక్సీ డ్రైవర్‌గా మారారు. ఆ ట్యాక్సీలోనే ఆయనకు జీవితాన్ని మార్చే మొదటి క్లూ దొరికింది. ఆయన ట్యాక్సీలో ఎక్కువమంది విదేశీ పర్యాటకులు ప్రయాణించేవారు. వారు ఎక్కడికి వెళ్లినా మొదట కొనేది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మాత్రమే. "స్వచ్ఛమైన నీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, ఇదొక మంచి బిజినెస్ అవుతుంది" అని శంకర్ మైండ్‌లో ఒక ఆలోచన బలంగా నాటుకుంది.

వ్యాపారంలో అడుగులు

1988లో కారు అమ్మేసి పుత్తూరులో ఒక చిన్న ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ పెట్టారు. ఆ తర్వాత టైర్ల బిజినెస్, ఆపై 1994లో 'ప్రవీణ్ క్యాపిటల్' పేరుతో ఒక ఫైనాన్స్ కంపెనీని కూడా ప్రారంభించారు. పాత ఆటోలు, కార్లకు ఎవరూ లోన్లు ఇవ్వని రోజుల్లో.. తానూ ఒకప్పుడు డ్రైవర్‌నే కాబట్టి వారి కష్టాలు తెలిసి లోన్లు ఇవ్వడం ప్రారంభించి సక్సెస్ అయ్యారు.

కానీ, మనసులో ఎక్కడో ఆ 'నీటి' బిజినెస్ ఐడియా అలాగే ఉంది. చివరికి 2000 సంవత్సరంలో పుత్తూరుకు దగ్గరలోని నరిమొగరు అనే గ్రామంలో ఒక ఫ్యాక్టరీ పెట్టి, కన్నడంలో చుక్క అని అర్థం వచ్చేలా 'బిందు' (Bindu) అనే బ్రాండ్‌తో వాటర్ బాటిళ్ల బిజినెస్ స్టార్ట్ చేశారు.

జీరా సోడాతో సంచలనం

ఒకసారి ఉత్తర భారతదేశ పర్యటనలో ఒక చిన్న దుకాణంలో సోడాలో జీలకర్ర పొడి, ఉప్పు కలిపి అమ్మడం శంకర్ చూశారు. "దీన్ని ఇంకా బెటర్‌గా చేసి దేశీ స్టైల్‌లో ఎందుకు ఇవ్వకూడదు?" అనుకున్నారు. అంతే, ఊరొచ్చి 'బిందు ఫిజ్ జీరా మసాలా' (Bindu Fizz Jeera Masala) ను తయారు చేశారు.

మొదట్లో ఈ డ్రింక్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మార్కెట్‌కు 200 బాక్సులు పంపితే 100 బాక్సులు వెనక్కి వచ్చేసేవి. ఎందుకంటే మార్కెట్‌లో పెప్సీ, కోకాకోలా లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు రాజ్యమేలుతున్నాయి. కానీ, శంకర్ వెనకడుగు వేయలేదు. హైవేల పక్కన ఉన్న గోడలపై పెయింటింగ్‌లు వేయిస్తూ ప్రచారం చేశారు. మెల్లగా జనాలకు ఈ లోకల్ టేస్ట్ నచ్చడం మొదలైంది. స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత 'బిందు జీరా సోడా' తాగడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది.

నేటి సామ్రాజ్యం

తాజా అంచనాల ప్రకారం.. సత్య శంకర్ నేతృత్వంలోని 'ఎస్‌జీ కార్పొరేట్స్' టర్నోవర్ ఏకంగా రూ. 900 కోట్లకు చేరింది. ఇందులో కేవలం 'హౌస్ ఆఫ్ బిందు' (డ్రింక్స్, స్నాక్స్) నుండే రూ. 570 కోట్లు వస్తుండగా, ఫైనాన్స్ బిజినెస్ నుండి రూ. 330 కోట్లు వస్తోంది. జీరా మసాలా నుండి మ్యాంగో జ్యూస్ వరకు 55 రకాల ప్రొడక్ట్స్ వీరికి ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలలో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రాబోతున్నాయి.

తన ఊరి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం, లోకల్ టేస్ట్‌ను నమ్మడమే తన సక్సెస్ సీక్రెట్ అని శంకర్ చెబుతారు. ఒకప్పుడు ఆటో నడిపిన ఈ బెల్లారే కుర్రాడు.. నేడు ఒక లగ్జరీ రోల్స్ రాయిస్ కారును కొనే స్థాయికి ఎదిగారు. పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా, కేవలం కష్టపడే తత్వం, ఒక చిన్న ఐడియాతో అద్భుతాలు సృష్టించవచ్చని సత్య శంకర్ నిరూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+