Young Techie: 12 ఏళ్ల వయస్సులో మనం అయితే ఏం చేస్తాం.. మహా అయితే పిల్లలతో కలిసి ఆడుకుంటాం. కానీ ఈ కుర్రాడు అలా కాదు. అంత చిన్న వయస్సులోనే ఏకంగా 3 యాప్స్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. అయితే ఈ కుర్రాడు భవిష్యత్తులో కోట్లు సంపాదించే ఛాన్స్ ఉందంటున్నారు. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.

రైతు బిడ్డ విజయాలు..
హర్యానాలోని సాధారణ రైతు కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలుడు కార్తికేయ జాగర్ సొంతంగా మూడు యాప్‌లను రూపొందించి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ రికార్డు సృష్టించాడు. కార్తికేయ యూట్యూబ్ వీడియోల నుంచి నేర్చుకున్న జ్ఞానంతో సొంతంగా మూడు ఎడ్యుకేషనల్ యాప్‌లను రూపొందించాడు.

స్మార్ట్ ఫోన్ వినియోగం..
కార్తికేయ జాగర్ హర్యానా, ఝజ్జర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాడు. మహమ్మారి సమయంలో అతనికి ఆన్‌లైన్ తరగతుల కోసం తండ్రి అజిత్ సింగ్ అతనికి రూ.10,000 విలువైన మొబైల్ ఫోన్ కొన్నాడు. కొన్ని కోడింగ్ ఫంక్షన్‌లు అకస్మాత్తుగా పనిచేయడం మానేసినందున, తన తండ్రి కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్‌ను బాగుచేయటం సొంతంగా నేర్చుకున్నాడు. తర్వాత స్వయంగా దానిని బాగుచేసుకుని చదువు కొనసాగించాడు.

యాప్ డెవలపర్..
ఈ దశలో, యూట్యూబ్ ద్వారా మరికొన్ని విషయాలు నేర్చుకోవడం ద్వారా యాప్ డెవలపర్‌గా మారాలనే ఆలోచన జాగర్‌కి వచ్చింది. అతను మాట్లాడుతూ, 'నేను యూట్యూబ్‌లో కొన్ని విషయాలు నేర్చుకున్నాను మరియు మూడు యాప్‌లను రూపొందించాను. మొదటిది లూసెంట్ GK ఆన్‌లైన్‌లో సాధారణ జ్ఞానానికి సంబంధించినది. రెండవది రామ్ కార్తీక్ లెర్నింగ్ సెంటర్‌లో కోడింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ బోధించే యాప్ మరియు మూడవది శ్రీ రామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు, ఈ యాప్‌లు సుమారు 45 వేల మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను అందిస్తున్నాయని జాగర్ తెలిపారు.
'>డిజిటల్ ఇండియా..
ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా ప్రచారంతో నేను స్ఫూర్తి పొందానని, మరింత నేర్చుకుని దేశానికి సేవ చేయాలనుకుంటున్నానని జగ్గర్ అన్నాడు. ఈ బాలుడు హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై స్కాలర్‌షిప్ కూడా పొందడం గమనార్హం. ఇంత చిన్న వయస్సులోనే కుమారుడి విజయంపై తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాడు.

హర్యానా ముఖ్యమంత్రి ప్రశంసలు..
బాలుడి విజయాలను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విట్టర్‌లో అభినందించారు. "జజ్జర్‌కు చెందిన పన్నెండేళ్ల కార్తికేయ అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించాడు. స్పోర్ట్, సంస్కృతి, కళలతో పాటు, హర్యానా యువత ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో ప్రశంసనీయమైన పని చేస్తున్నారు" అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

కోట్లు సంపాదించే అవకాశం..
12 ఏళ్ల కార్తికేయ జాగర్ సరైన గైడెన్స్ ఉంటే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలకు యాప్‌లను అభివృద్ధి చేయగలడు. దీని ద్వారా అతడు లక్షల నుంచి కోట్ల వరకు సంపాదించగలడని అతని పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications