Upcoming IPOs: మార్కెట్లపై ఐపీవోల దాడి.. ఈవారం ఏకంగా 12 కంపెనీల రాక.. త్వరపడండి..
IPO News: స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం భారీ ర్యాలీ కొనసాగుతోంది. ఈ క్రమంలో దలాల్ స్ట్రీట్‌లోకి ఈవారం 12 ఐపీవోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాయి. వీటికి తోడు ఎనిమిది లిస్టింగ్స్ కూడా క్యూ కట్టాయి.
రానున్న వారం కూడా మార్కెట్లు స్థిరంగా లాభాల్లోనే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇష్యూ ప్రారంభించనున్న 12 కంపెనీల ఐపీవోలు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి తమ మూలధన అవసరాల కోసం ఏకంగా రూ.4,600 కోట్లను సమీకరించేందుకు వచ్చేస్తున్నాయి. గతవారం మార్కెట్లోకి వచ్చిన ఐపీవోలు ఇన్వెస్టర్ల నుంచి రూ.4,000 కోట్లను విజయవంతంగా రైజ్ చేశాయి.

రానున్న వారంలో ఐనాక్స్ లిమిటెడ్, ముత్తూట్ మైక్రోఫిన్, మోతిసన్స్ జ్యూవెలరీ, సూరజ్ ఎస్టేట్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఆర్బీజెడ్ జ్యూవెలర్స్, క్రెడో బ్రాండ్స్, ఆజాద్ ఇంజనీరింగ్, ఇన్నోవా క్యాప్టాబ్ లిమిటెడ్, సహారా మారిటైమ్ లిమిటెడ్, ఎలక్ట్రో ఫోర్స్ లిమిటెడ్, శాంతి స్పింటెక్స్ లిమిటెడ్, ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్ కంపెనీలు తమ ఐపీవోల ఇష్యూను ప్రారంభిస్తున్నాయి.
ఇక లిస్టింగ్ అవుతున్న ఐపీవోల వివరాలను గమనిస్తే.. డోమ్స్ ఐపీవో డిసెంబర్ 20న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో జాబితా అవుతోంది. ఇండియన్ షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు సైతం డిసెంబర్ 20న మార్కెట్లోకి అరంగేట్రం చేస్తున్నాయి. ఇక డిసెంబర్ 18న ప్రెస్‌టోనిక్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా అవుతున్నాయి. SJ లాజిస్టిక్స్ ఐపీవో డిసెంబర్ 19న, Shree OSFM E-మొబిలిటీతో పాటు సియారం రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఐపీవోలు డిసెంబర్ 21న జాబితా కానున్నాయి. ఇదే రోజున బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్, ఐనాక్స్ ఇండియా కంపెనీలు సైతం తమ లిస్టింగ్ చేయనున్నాయి.


Click it and Unblock the Notifications