Multibagger Stocks: అసలే కరోనా నుంచి కోలుకుంటున్నాం అని ఊపిరి పీల్చుకునేలోపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీని కారణంగా మార్కెట్లలో ఒడిదొడుకులు విపరీతంగా పెరిగాయి. అయితే ఈ కష్ట సమయాల్లో కూడా కొన్ని స్టాక్స్ మంచి పనితీరును కనబరిచాయి.

ఏడాదిలో డబ్బులు డబుల్..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది వాడిలాల్ ఇండస్ట్రీస్(Vadilal Industries Ltd) షేర్ల గురించి. 1907లో ప్రారంభమైన ఈ ఐస్ క్రీం కంపెనీకి ప్రస్తుతం 115 ఏళ్లు. ఈ స్టాక్ తన ఇన్వెస్టర్ల డబ్బును ఏడాది కాలంలోనే డబుల్ చేసి మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఈ స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లు గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడిని అందించాయి. 6 నెలల క్రితం జనవరి 28న రూ.870 వద్ద ఉన్న ఈ స్టాక్ ధర ఈరోజు ఉదయం రూ.2,105 వద్ద ట్రేడ్ అవుతోంది.

మూడేళ్ల క్రితం స్టాక్ ధర..
గత 3 సంవత్సరాల పనితీరును పరిశీలిస్తే.. కంపెనీ షేరు ధర రూ.493 నుంచి రూ.2112.20 స్థాయికి పెరిగింది.అంటే.. కంపెనీ షేర్లు ఈ క్రమంలో 328.39% పెరిగాయి. అదే ఏడాది క్రితం షేర్ ధరను గమనించినట్లయితే.. రూ.1026 నుంచి రూ.2112.20కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ విలువ రెండింతలైంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.823.80 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2,247.70గా ఉంది.

లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి..
6 నెలల క్రితం ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీ షేర్లలో రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ రూ.2.40 లక్షలుగా ఉండేది. అదే సంవత్సరం కిందట ఈ స్టాక్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం రూ.2 లక్షలకు పైగా రాబడి వచ్చేది. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ. 1,508 కోట్లుగా ఉంది.

45 దేశాల్లో కంపెనీ వ్యాపారాలు..
115 సంవత్సరాల పురాతనమైన ఈ కంపెనీ.. ఐస్ క్రీమ్స్, ఫ్రోజెన్ డెజర్ట్‌లు, ప్రాసెస్డ్ ఫుడ్ తో పాటు ఇతర పాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ.. 45 దేశాల్లో వ్యాపారం చేస్తోంది. దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications