న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఓ తీపికబురు ఇచ్చింది. అదనంగా 2,655 కోట్ల రపాయల మేర రుణాలను తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి- నిర్మల సీతారామన్ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లక్ష్యాన్ని అందుకోవడం వల్ల అదనపు రుణాన్ని తీసుకునే వెసలుబాటును కల్పించింది.

ఏపీ సహా 11 రాష్ట్రాలు..
ఏపీ సహా మొత్తం 11 రాష్ట్రాలు ఈ లక్ష్యాన్ని అందుకున్నాయి. ఆయా రాష్ట్రాలన్నింటికి కూడా డిమాండ్, అవసరాలకు అనుగుణంగా రుణాలను తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రాల అవసరాల మేర రుణ మొత్తాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. 11 రాష్ట్రాలు కలిపి 15,271 కోట్ల రూపాయల మేర రుణాలను పొందవచ్చని తెలిపింది. ఇందులో ఏపీ వాటా 2,655 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో 0.25 శాతానికి సమానం ఈ మొత్తం.

ఆ రాష్ట్రాలివే..
ఏపీతో పాటు బిహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్-మే-జూన్ నెలల కాలానికి కేంద్రం నిర్దేశించిన క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ టార్గెట్‌ను అందుకున్నాయి. ఈ జాబితాలో దక్షిణాది నుంచి ఏపీ ఒక్కటే ఈ లక్ష్యాన్ని అందుకోవడం ఇక్కడి ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

జీఎస్డీపీలో
క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లక్ష్యాన్ని అందుకోవడం అంటే ఆర్థిక ప్రగతి రేటు అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టే. ఆర్థిక ప్రగతిరేటును నిర్ధారించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికానికి అన్ని రాష్ట్రాలకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటుంది. ఇది ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ చోటు చేసుకునే ప్రక్రియే. ఈ లక్ష్యాన్ని అందుకున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటుంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 0.25 శాతానికి సమానంగా అదనంగా రుణాలను తీసుకోవడానికి అనుమతి ఇస్తుంటుంది.

ఏ రాష్ట్రానికి ఎంత..
ఈ దఫా 15,721 కోట్ల రూపాయల మేర అదనపు రుణాలను తీసుకోవడానికి ఆ 11 రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది. ఇందులో 2,655 కోట్ల రూపాయల మొత్తాన్నీ ఏపీ వాటాగా నిర్ధారించింది. బిహార్-1,699, ఛత్తీస్‌గఢ్-895, హర్యానా-2,105, కేరళ-2,255, మధ్యప్రదేశ్-2,590, మణిపూర్-90, మేఘాలయా-96, నాగాలాండ్-89, రాజస్థాన్-2,593, ఉత్తరాఖండ్-654 కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవచ్చు. రెండో త్రైమాసికానికి సంబంధించిన వివరాలు వచ్చే నెల వెల్లడయ్యే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications