పనిచేస్తున్న కంపెనీకే కుచ్చుటోపీ.. కనిపించని ఉద్యోగుల పేర్ల మీద 20 కోట్లు స్వాహా.. ఎలా చిక్కాడంటే ?
తరచుగా కంపెనీకి ఉద్యోగులు కన్నాలు వేసిన వారిని చూసుంటాం.. పనిచేస్తున్న కంపెనీకే టోపీ పెట్టినవాళ్ళని చూస్తుంటాం కానీ కంపెనీ ఉన్నత హోదాలో ఉంటూ ఉద్యోగుల పేరుతో కోట్లు కొల్లకొట్టిన వారిని మీరు ఎప్పుడైనా చేసారా.. చేసిన తప్పు ఎక్కువ రోజులు దాగదు అనే సామెత కుడి ఉంది... ఓ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ నిర్వాహకుడు ఉద్యోగుల పేరు మీద కోట్లు మూటకట్టుకున్నాడు. ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా 20 మంది ఉద్యోగులు నిజంగా కంపెనీలో పనిచేస్తున్నట్టు కంపెనీని నమ్మించి వారి పేర్ల మీద జీతాలు తీసుకుంటున్నాడు. ఈ తతంగం అంత ఒక నెలనో రెండు నెలలో కాదు సుమారు పదేళ్లుగా కొనసాగించాడు. ఇదంతా జరిగింది మన దేశంలో కాదు చైనాలో.. చైనాలోని షాంఘైలోని ఒక కంపెనీకి చెందిన హ్యూమన్ రిసోర్స్ నిర్వాహకుడు ఉద్యోగులను నియమించకుండా రూ.20 కోట్ల మేర మోసం చేసినట్లు తేలింది. యాంగ్ షాంఘైలో హెడ్ ఆఫీసు ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీలో హ్యూమన్ రిసోర్స్ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అతను 8 సంవత్సరాలుగా 20 కోట్ల ఫ్రాడ్ చేసాడు. ఒక చైనీస్ వార్తాపత్రికలో ప్రచురించిన ఒక నివేదికలో HR మేనేజర్ యాంగ్ మాట్లాడుతూ కంపెనీ 2014లో 22 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు.
ఎనిమిది సంవత్సరాలుగా వారి జీతాలు ఇతర పేమెంట్లు అతనే అందుకుంటున్నారు. ఇందుకు ఈ నకిలీ ఉద్యోగుల పేర్లతో కొన్ని బ్యాంకుల్లో అకౌంట్స్ తెరిచారు. వాళ్ళ జీతం ఈ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తూ అతను రాజ జీవితాన్ని గడుపుతున్నారు. దాదాపు 8 సంవత్సరాలుగా అతను కంపెనీని మోసం చేస్తూ నకిలీ పేర్లు సృష్టించి ఎవరినీ కంపెనీలో నియమించకుండా ఈ మోసానికి పాల్పడుతున్నాడు. అయితే అతను నకిలీగా పేర్కొన్న ఉద్యోగికి 100 శాతం అటెండేన్స్ ఉండటంతో కంపెనీకి అనుమానం వచ్చింది. ఒక ఉద్యోగి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆఫీసుకు వచ్చాడనే అనుమానం వచ్చిన తర్వాత కంపెనీ దర్యాప్తు ప్రారంభించింది. అప్పుడే అక్కడ పనిచేసిన ఇతర ఉద్యోగులు అలాంటి ఉద్యోగిని తాము ఎప్పుడూ చూడలేదని, అలాంటి పేరున్న వ్యక్తి ఇక్కడ లేడని చెప్పారు.

దీని తరువాత కంపెనీ హ్యూమన్ రిసోర్స్ నిర్వాహకుడిపై కఠినమైన దర్యాప్తు నిర్వహించాక అతను చాలా సంవత్సరాలుగా ఎటువంటి ఉద్యోగులను నియమించకుండా తప్పుడు నివేదిక ఇవ్వడం ద్వారా 20 కోట్లు దుర్వినియోగం చేశాడని వెల్లడైంది. అతను కంపెనీ నుండి మోసపూరితంగా పొందిన డబ్బులో దాదాపు రెండున్నర కోట్లు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని తరువాత, కంపెనీ అతనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. అతనికి ఇప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ మోసాన్ని కప్పిపుచ్చడానికి యాంగ్ కంపెనీలో కొత్త ఉద్యోగుల ఎంపిక, వారి రాజీనామాలపై నిర్ణయం ఇంకా వారి జీతాల నిర్ణయంపై తనకు పూర్తి హక్కు ఉండేలా చూసుకున్నాడు. ఇది అతని మోసానికి చాలా సహాయం చేసింది. అంతేకాదు నకిలీ ఉద్యోగుల పే స్లిప్స్, అలోవేన్స్ సహా ఇతర బెనిఫిట్స్ కూడా సృష్టించి కంపెనీ నమ్మించాడు.


Click it and Unblock the Notifications