For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10-15 శాతం ఉద్యోగుల వేతనాల కోతతో అంత ప్రభావం ఉండదు

|

కరోనా మహమ్మారి-లాక్‌డౌన్ కారణంగా సంస్థలు, ఉద్యోగుల రాబడి, వేతనాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రానున్న కాలంలో రుణాల అంశం ఎలా ఉంటుందనే దానిపై ప్రయివేటు బ్యాంకు దిగ్గజం HDFC అంచనా వేస్తోంది. కరోనా నేపథ్యంలో వినియోగదారులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని HDFC బ్యాంకు అంచనా వేస్తోంది.

ప్రతి గూగుల్ ఉద్యోగికి అదనంగా రూ.75,000, ఎందుకంటే: సుందర్ పిచాయ్ ప్రకటనప్రతి గూగుల్ ఉద్యోగికి అదనంగా రూ.75,000, ఎందుకంటే: సుందర్ పిచాయ్ ప్రకటన

10-15 శాతం కోతతో పెద్దగా ప్రభావం ఉండదు

10-15 శాతం కోతతో పెద్దగా ప్రభావం ఉండదు

కరోనా కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తం కోత విధించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం నుండి 15 శాతం కోత విధించడం ద్వారా రుణాలపై ప్రభావం ఉండదని, కానీ కొంత మార్పులు ఉండవచ్చునని తెలిపింది. కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్‌తో గత రెండు నెలలుగా కుదేలైన వాహన విక్రయాలు మళ్లీ బలంగా పుంజుకోవచ్చునని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కంట్రీ హెడ్ (రిటైల్ బ్యాంకింగ్) అరవింద్ కపిల్ వెల్లడించారు.

ఇవి దన్నుగా నిలుస్తాయి

ఇవి దన్నుగా నిలుస్తాయి

వాహన విక్రయాలు పుంజుకుంటాయని, రుణాలు కొద్ది కాలం తర్వాత తిరిగి పుంజుకుంటాయని చెబుతూ.. సామాజిక దూరం నిబంధనలు, బ్యాంకులు అందిస్తున్న డిజిటల్ రుణాలు ఇందుకు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. వేతనాల్లోను కోత 10 శాతం నుండి 15 శాతం కోత ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఇది భారీ మొత్తం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ చిన్న రుణాలకు డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం కేరళ వరదలు లేదా నోట్ల రద్దు వంటి క్లిష్ట సమయాలను గుర్తు చేశారు. డిజిటల్ రుణాలు పెరిగితే సేల్స్ పెరిగే అవకాశముందన్నారు.

20 లక్షల కోట్ల ప్యాకేజీపై సానుకూలత

20 లక్షల కోట్ల ప్యాకేజీపై సానుకూలత

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని కపిల్ స్వాగతించారు. వ్యాపారానికి మూలధనం పెద్ద అడ్డంకి అని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరమన్నారు. జీడీపీ వృద్ధి రేటు క్షీణించిన పరిస్థితుల్లో గత సంవత్సరం చేపట్టిన పన్ను సంస్కరణల కంటే రుణ హామీల ద్వారా ప్రయోజనం చేకూర్చడం చాలా మంచిది అని అభిప్రాయపడ్డారు. ఇలాంటిసంక్షోభం నుండి నేర్చుకొని ముందుకు సాగాలన్నారు.

English summary

10-15 శాతం ఉద్యోగుల వేతనాల కోతతో అంత ప్రభావం ఉండదు | 10 to 15 percent moderation in salaries not to impact lending practice

Expecting discretionary spending to return in the next few months, private lender HDFC Bank on Wednesday said a 10-15 per cent moderation in salaries will not lead to an overhaul of consumer lending practices though some prudence might be in order.
Story first published: Thursday, May 28, 2020, 8:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X