లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)... భారత దేశంలో ఈ పేరు తెలియని వారుండరు. కోట్ల మంది జీవితాలకు బీమా రక్షణ కల్పిస్తూ, ఆపత్కాలంలో ఆదుకునే నేస్తంగా దీనికి గుర్తింపు ఉంది. 60 ఏళ్ళ నుంచి దేశ ప్రజల సేవకు అంకితమైన ఈ ప్రభుత్వ రంగ సంస్థ... త్వరలోనే స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ అవబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన సందర్భంగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి మరోసారి ఎల్ఐసి పై పడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యం లో నడుస్తున్న సంస్థ అనే విషయం తెలిసిందే.
ఈ సంస్థ విలువ మదింపు చేయటం ఒకరకంగా క్లిష్టమైన పని. ఎందుకంటే, రూ లక్షల కోట్లలో స్థిర, చర ఆస్తులను కలిగి ఉంది. అందుకే, ఒక వేళ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా ఎల్ఐసి గనుక స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయితే... విలువ పరంగా అదే దేశంలో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించనుంది. మార్కెట్ క్యాపిటలైజెషన్ ప్రకారం ముకేశ్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ కూడా ఎల్ఐసి ముందు చిన్నబోనున్నాయి. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది.

దేశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవో ...
ఎల్ఐసిలో ప్రస్తుతం 100% వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఇందులో ఒక 25-30% ఆస్తుల మదింపు జరిపినా దాని విలువ సుమారు రూ 10 లక్షల కోట్లు అవుతుంది. అందులో ఒక 10% వాటా విక్రయించినా కూడా దానిని కొనుగోలు చేసేందుకు మన ఇన్వెస్టర్లు సరిపోరు. ఎందుకంటే ఇది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవో కానుంది. ఇటీవల సౌదీ ఆరాంకో కంపెనీ ఎలాగైతే ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో గా చరిత్ర సృష్టించిందో, ఎల్ఐసి కూడా అందుకు ఏమాత్రం తీసిపోదని స్టాక్ మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. 60 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఎల్ఐసి కి కేవలం 20 ఏళ్ళ అనుభవం ఉన్న ప్రైవేటు రంగ సంస్థలతో పోటీ ఉండదని, విలువ మదింపు జరిపేటప్పుడు అది గీటురాయి కాబోదని చెబుతున్నారు.

బడ్జెట్ లో హైలైట్...
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్ఐసి పేరు ప్రస్తావించటంతో ఎప్పటి నుంచో దానిని ప్రైవేటీకరిస్తారన్న విషయంపై మబ్బులు తొలగిపోయాయి. అయితే, ఎల్ఐసి ని ప్రైవేటీకరించే కంటే ఐపీవో మార్గంలో కొంత వాటా విక్రయించటమే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. అందుకే బడ్జెట్లో ఈ ప్రస్తావన చేశారు. బడ్జెట్లో ఇదే అంశం హైలైట్ గా నిలిచిందని స్టాక్ మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు. తక్కువలో తక్కువగా ఎల్ఐసి విలువను రూ 10 లక్షల కోట్లు అని లెక్కించినా... అందులో ప్రభుత్వం ఒక 5% వాటా విక్రయించినా కూడా దానికి రూ 50,000 కోట్ల నిధులు సమకూరుతాయి. దీంతో 202-21 కి విధించుకున్న డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ ను ఈజీగా ప్రభుత్వం చేరుకుంటుందని భావిస్తున్నారు.

రిటైల్ ఇన్వెస్టర్లు వరం...
60 ఏళ్ళ తన ప్రస్థానంలో ఎల్ఐసి అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఒకవైపు తన వినియోగదారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే.. మరో వైపు ప్రతియేటా తన లాభాలను పెంచుకుంటోంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డివిడెండ్ చెల్లిస్తోంది. లాభదాయకత అధికంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్ఐసి ముందు వరుసలో ఉంటుంది. అందుకే, ఈ సంస్థ విజయ ప్రస్థానంలో పాలు పంచుకునేందు ఐపీవో ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక అవకాశం లభిస్తుంది. సంపద సృష్టి, అందులో భాగస్వామ్యం సాధ్యమవుతుంది. అలాగే, ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ అయితే.. ఎల్ఐసి తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది. కేవలం ప్రభుత్వం చెప్పింది కదా అని ఎవరికి పడితే వారికి పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయటం కుదరదు. ఇకపై అంతా పారదర్శకంగా, నిబంధనలకనుగుణంగా చేల్సి ఉంటుంది. అంటే క్రమశిక్షణ అలవడుతుంది. అది అటు ఎల్ఐసి కి, ఇటు తన కస్టమర్లకు మరింత మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications