Diwali Trading: దేశీయంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తుల సంఖ్య భారతదేశంలో విపరీతంగా పెరుగుతోంది. కొందరు యువత తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడుల కోసం స్టాక్ మార్కెట్లను ఉత్తమ మార్గంగా ఎంచుకుంటుంటే, మరికొందరు మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెడుతున్నారు. సాధారణంగా దీపావళికి తర్వాతి సంవత్సర కాలం కోసం పెట్టుబడి నిర్ణయాలతో పోర్ట్ ఫోలియోలో మార్పులు చేస్తుంటారు.
ఈ క్రమంలో రాబోయే దీపావళి నాటికి ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించేందుకు అవకాశం ఉన్న లార్జ్ క్యాప్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీల్లో మెుత్తంగా 10 షేర్ల గురించి హెచ్‌డీఎఫ్‌సీ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. బ్రోకరేజ్ పేర్కొన్న స్టాక్స్ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేకే లక్ష్మీ సిమెంట్, జ్యోతి ల్యాబ్స్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, ఎన్‌సీసీ లిమిటెడ్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీల షేర్లు చోటు దక్కించుకున్నాయి. తర్వాతి దీపావళి వరకు సదరు కంపెనీ షేర్లను ఇన్వెస్టర్లు హోల్డ్ చేయాలని.

ముందుగా బ్యాంకింగ్ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ కొనుగోలు ధరను రూ.96-106గా పేర్కొంటూ టార్గెట్ ధరను రూ.132గా నిర్ణయించబడింది. ఇదే క్రమంలో సిమెంట్ వ్యాపారంలో ఉత్తర భారతంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న జేకె లక్ష్మీ సిమెంట్ కంపెనీ షేర్లను రూ.738-819 ధర వద్ద కొనుగోలు చేయాలని సూచించింది. దీనికి టార్గెట్ ధర రూ.936 వద్ద ఉంచబడింది. ఇదే క్రమంలో పర్సనల్ ఎఫ్ఎంసీజీ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న జ్యోతి ల్యాబ్స్ కంపెనీ షేర్లను రూ.480-533 వద్ద కొనుగోలు చేయాలని, భవిష్యత్తులో ఒక్కో షేరు రేటు రూ.600కి చేరుకుంటుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది.
ఇదే క్రమంలో ఎల్ అండ్ టి ఫైనాన్స్ కంపెనీ షేర్ల కొనుగోలుకు రూ.153-170 అనుకూలమైన రేటుగా పేర్కొంటూ టార్గెట్ ధరను రూ.219గా ప్రకటించబడింది. ఇదే క్రమంలో నేషనల్ అల్యూమినియం కంపెనీ షేర్లను రూ.198-220 మధ్య కొనుగోలు చేయవచ్చంటూ ఇందుకోసం రూ.270 టార్గెట్ ధరగా పేర్కొనబడింది. నిర్మాణ రంగంలో అతిపెద్ద ఆటగాడిగా ఉన్న ఎన్‌సీసీ లిమిటెడ్ కంపెనీ షేర్లను రూ.273-303 ధర వద్ద కొనుగోలుకు ఉత్తమంగా పేర్కొంటూ టార్గెట్ ధర రూ.363గా ప్రకటించబడింది.
ఇదే క్రమంలో కెమికల్స్ వ్యాపారంలో ఉన్న నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ కంపెనీ షేర్లను రూ.3059-3396 మధ్య కొనుగోలు చేయాలని పేర్కొంటూ టార్గెట్ ధరను రూ.3948 వద్ద ఉంచింది. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ రూ.893-991 మధ్య కొనుగోలు చేయాలంటూ రూ.1160 టార్గెట్ ధరగా వెల్లడించింది. ఇక అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను రూ.2447-2716 మధ్య స్థాయిల్లో కొముగోలుకు ఉత్తమంగా పేర్కొంటూ టార్గెట్ ధర రూ.3243గా నిర్ణయించబడింది. ఇక చివరిగా ప్రభుత్వ యాజమాన్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను రూ.733-813 మధ్య స్థాయిలో కొనుగోలు చేయాలని సూచిస్తూ టార్గెట్ ధరను రూ.960గా నిర్ణయించబడింది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications