TCSలో టాటా గ్రూప్, ఎల్ఐసీతో పాటు టాప్ 10 షేర్ హోల్డర్స్ ఎవరంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) భారత అతిపెద్ద ఐటీ కంపెనీ. ప్రపంచ అతిపెద్ద ఐటీ కంపెనీల్లో టీసీఎస్ ఉంటుంది. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల్లో క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, టీసీఎస్, యాక్సెంచర్, ఒరాకిల్ ఉన్నాయి. దేశీయంగా చూసుకుంటే టీసీఎస్ సెకండ్ మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీ. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.1369604 కోట్లు కాగా, టీసీఎస్ ఎం-క్యాప్ రూ.1168511 కోట్లుగా ఉంది. టీసీఎస్ ఇటీవలే FY21 వార్షిక నివేదికను విడుదల చేసింది. టీసీఎస్ అంటే టాటా గ్రూప్ గుర్తుకు వస్తుంది. ఇందులో మార్చి 31, 2021 నాటికి ఉన్న టాప్ 10 కంపెనీ షేర్ హోల్డర్లు ఇలా...
టీసీఎస్‌లో మెజార్టీ షేర్ హోల్డర్ టాటా సన్స్ ప్రయివేట్ లిమిటెడ్. ఇందులో ఈ కంపెనీకి 2,669,125,829 షేర్లు ఉన్నాయి. మొత్తం కంపెనీలో టాటా సన్స్ వాటా 72.2 శాతంగా ఉంది.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 143,882,693 షేర్లతో రెండో స్థానంలో ఉంది.
టీసీఎస్‌లో మూడో అతిపెద్ద షేర్ హోల్డర్ ఇన్వెస్కో ఒప్పెనిమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్. ఈ కంపెనీకి 29,442,588 షేర్లు ఉన్నాయి. 26,771,470 షేర్లతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ నాలుగో స్థానంలో ఉంది.

ఆ తర్వాత వరుసగా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ (20,931,890) ఐదో స్థానంలో, వాంగార్డ్ ఎమర్జింగ్ మార్కెట్స్ స్టాక్స్ ఇండెక్స్ ఫండ్ (13,581,105) ఆరో స్థానంలో, ఎన్పీఎస్ ట్రస్ట్ అకౌంట్ (13,327,027) ఏడో స్థానంలో, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ (13,123,054) 8వ స్థానంలో, వాంగార్డ్ టోటల్ ఇంటర్నేషనల్ స్టాక్ ఇండెక్స్ ఫండ్ (12,174,731) తొమ్మిదో స్థానంలో, ఫస్ట్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐసీవీసీ-స్టివార్ట్ ఇన్వెటర్స్ ఏసియా పసిఫిక్ లీడర్స్ ఫండ్ (11,529,01 షేర్లు) పదవ స్థానంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications