IT Companies: ఐటీ కంపెనీలకు రోజుకో చిక్కు ఎదురవుతోంది. ఒకప్పుడు అద్బుతంగా వెలిగిన కంపెనీలు ప్రస్తుతం ఊహించిన ఇబ్బందులను చూస్తున్నాయి. వ్యాపారం బాగానే ఉన్నా.. ఉద్యోగుల తీరు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

మూన్‌లైటింగ్‌తో మెుదలై..
మెున్నటి వరకు కంపెనీలు చిలక్కి చెప్పినట్లు ఉద్యోగులకు చెప్పాయి రెండు ఉద్యోగాలు వద్దురా బాబు అని. కానీ కొంత మంది దీనిని లెక్క చేయకుండా కొనసాగించారు. దీంతో విప్రో 300 మందిని తొలగించింది. మూన్‌లైటింగ్ ప్రస్తుతం ఐటీ, టెక్ ఉద్యోగులలో హాట్ టాపిక్ గా మారి వారికి భయాన్ని పెంచుతోంది.

టాప్ టెక్ కంపెనీలు..
దేశంలోని టాప్- 4 ఐటీ కంపెనీలైన విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌లలోనే 15 లక్షల మందికి పైగా టెక్కీలు పనిచేస్తున్నారు. కరోనా సమయంలో ఇళ్లకు వెళ్లిన ఉద్యోగులు కంపెనీలకు కంచిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం అలవాటు పడిన అనేక మంది ఆఫీసులకు రాలేమని చెప్పటంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సెన్సేషనల్ రిపోర్ట్..
భారతీయ ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి 100 మంది ఐటీ ఉద్యోగుల్లో ఒకరు అదనపు ఆదాయం, అనుభవం ఏకకాలంలో రెండు కంపెనీల్లో పనిచేస్తున్నారని విషయం వెలుగులోకి వచ్చింది. జాబ్ సెర్చ్ సైట్‌లలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. వీరు పూర్తి సమయం ఒక కంపెనీలో కొనసాగుతూ.. ఖాళీ సమయంలో మరో కంపెనీ కోసం పనిచేస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో అనేక మంది వీటికి అలవాటుపడటంతో.. ఆ అలవాటును మాన్పించేందుకు ఆఫీసులకు రమ్మని ఆదేశిస్తున్నాయి.

టెక్ మహీంద్రా..
టెక్ మహీంద్రా CP గురునాని మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇస్తూ ఉద్యోగులు రెండవ ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో తప్పు లేదని చెప్పారు. CIEL HR ప్రకారం దాదాపు 5 శాతం మంది IT ఉద్యోగులు కొన్ని రకాల సైడ్ బిజినెస్ లేదా ఆదాయ మార్గాలను కలిగి ఉన్నారు.

మోదీ మంత్రి ఏమంటున్నారంటే..
దేశంలోని ఐటీ కంపెనీలు మూన్‌లైటింగ్ పై సీరియస్ గా ఉండగా.. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఉద్యోగులకు అనుకూలంగా ప్రకటన చేశారు. ఉద్యోగులను కట్టడి చేయడం సరికాదని, వారి కలలను సాకారం చేసుకునేందుకు అనుమతించాలని ఐటీ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. మూన్‌లైటింగ్ పై మొట్ట మొదటి సారిగా ఒక కేంద్ర మంత్రి ప్రకటన చేయటం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications