హుజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు గత 5 సంవత్సరాలలో దాదాపు 2600% రాబడిని ఇచ్చాయి. ఈ కారణంగా ఇన్వెస్టర్ల మూలధనం డబుల్ రెట్లు పెరిగింది. ఆ కంపెనీకి తాజాగా ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. దింతో స్టాక్ మార్కెట్లో దీనిపై చర్చ జరుగుతోంది. హుజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ మౌలిక సదుపాయాల రంగంలో కొనసాగుతుంది. ఇప్పుడు కంపెనీ పునరుత్పాదక శక్తి రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. గత శుక్రవారం, కంపెనీ షేర్లు బిఎస్‌ఇలో దాదాపు 2% పెరిగి రూ.42.70 వద్ద ముగిశాయి. ఎవరైనా 5 సంవత్సరాల క్రితం ఈ షేరులో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు దాని విలువ రూ. 2.6 కోట్లు అయ్యేది. అయితే, ఇలాంటి షేర్లలో పెట్టుబడి పెట్టడం కూడా ప్రమాదకరం అని చెప్పవచ్చు. ఇందుకు కారణం వాటిలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. నవంబర్ 2024లో కంపెనీ షేర్ల పేస్ వాల్యూ 10:1 రేషియోలో విభజించింది. దీని తరువాత షేరు ధర రూ.100 కంటే దిగువకు వచ్చింది.
102.10 కోట్ల విలువైన ఆర్డర్
హుజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ వెంకటేష్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ నుండి రూ.102.10 కోట్ల ఆర్డర్‌ను పొందింది. ఈ ఆర్డర్ ముంబైలోని వెర్సోవా-బాంద్రా సీ లింక్ ప్రాజెక్ట్ కోసం. ఇందులో స్టీల్ కటింగ్, బెండింగ్, ఫిక్సింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ పనులు ఉంటాయి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బిఎస్ఇకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ ఈ విషయాన్నీ వెల్లడించింది. "ముంబైలోని వెర్సోవా బాంద్రా సీ లింక్ ప్రాజెక్ట్ సైట్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం కోసం టెక్నీకాల్ డ్రాయింగ్‌ల ప్రకారం హుజూర్ మల్టీ ప్రాజెక్ట్స్‌కు వెంకటేష్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ నుండి స్టీల్ కటింగ్, బెండింగ్, ఫిక్సింగ్ అలాగే స్ట్రక్చరల్ స్టీల్ ఎరక్షన్ కోసం ఆర్డర్ అందింది" అని ఫైలింగ్ తెలిపింది. ఇంకా పొందిన ప్రాజెక్ట్ విలువ రూ. 102.10 కోట్లు అని కూడా ఫైలింగ్ పేర్కొంది. సమాచారం ప్రకారం ఆర్డర్ పూర్తి చేయడానికి కాలపరిమితి ఆరు నెలలు.

రెండు, మూడు సంవత్సరాలలో ఎంత రిటర్న్ ఇచ్చిందంటే ?
ఈ వార్త తర్వాత, కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో పెరుగుదలను చూశాయి. శుక్రవారం నాడు దీని స్టాక్ దాదాపు 2% లాభంతో ముగిసింది. ప్రైమరీ సూచీలు ఎరుపు రంగులో ముగిశాయి. అయితే, గత ఒక సంవత్సరం నుండి స్టాక్ పనితీరు దాదాపు స్థిరంగా ఉంది. కానీ, రెండు సంవత్సరాలలో 351%, మూడు సంవత్సరాలలో 1,447% రాబడిని ఇచ్చింది, దింతో దీనిని మల్టీబ్యాగర్ స్టాక్‌గా మార్చింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 886.03 కోట్లు.
హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ నుండి వచ్చిన ఈ కొత్త ఆర్డర్ కంపెనీ భవిష్యత్తు అవకాశాలను మరింత బలోపేతం చేసింది. మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వం పెట్టుబడి పెంచడం వల్ల కంపెనీ మరింత ప్రయోజనం పొందుతుందని భావిస్తున్నారు. అదనంగా, పునరుత్పాదక ఇంధన రంగంలో కంపెనీ విస్తరణ కూడా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. అయితే, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి. అందువల్ల, పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే, గత పనితీరు భవిష్యత్తులో రాబడికి హామీ ఇవ్వదని గుర్తుంచుకోండి. పెట్టుబడిని ఎల్లప్పుడూ తెలివిగా ఇంకా రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాలి.


Click it and Unblock the Notifications