చోట షేర్ బడా ఇన్కమ్ అంటే ఇదే.. 1 లక్షని 84 లక్షలుగా చేసింది.. మీరు కొన్నారా..
penny stocks: స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కొన్ని పిన్ని స్టాక్స్ మాత్రం షేర్ హోల్డర్లకు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. అలంటి ఒక స్టాక్ కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనే చిన్న కంపెనీ షేర్ హోల్డర్లకు భారీ రాబడిని ఇచ్చింది. కేవలం 11 నెలల్లోనే కంపెనీ షేర్లు 8300 శాతానికి పైగా పెరిగాయి. దింతో ఈ కాలంలో కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ షేర్ ధర దాదాపు రూ.2 నుండి రూ.159కి పైగా పెరిగింది. నిన్న గురువారం అంటే మార్చి 13 2025న కంపెనీ షేర్ ధర కొత్తగా 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అలాగే కంపెనీ షేర్ ధర 52 వారాల కనిష్ట స్థాయి రూ.1.80.

రూ.1 లక్షను రూ.84 లక్షలుగా మార్చిన షేర్: కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ షేర్ ధర 2 ఏప్రిల్ 2024న రూ.1.89గా ఉంది. కానీ 13 మార్చి 2025న కంపెనీ షేర్ ధర రూ.159.25 వద్ద ముగిశాయి. అంటే గత 11 నెలల్లో కొఠారి ఇండస్ట్రియల్ షేర్లు 8325 శాతం పెరిగాయి. దీని బట్టి చూస్తే ఒక వ్యక్తి 2 ఏప్రిల్ 2024న కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఈ పెట్టుబడిని నిలుపుకుంటే ప్రస్తుతం రూ.1 లక్షతో కొనుగోలు చేసిన షేర్ల విలువ ఇప్పుడు రూ.84.25 లక్షలు అయ్యేది.
ఆరు నెలల్లో కంపెనీ 600% కంటే పైగా పెరిగిన షేర్లు: గత 6 నెలల్లో కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ షేర్లు 602 శాతానికి పైగా పెరిగాయి. 16 సెప్టెంబర్ 2024న ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు రూ.22.68గా ఉన్నాయి. 13 మార్చి 2025న కంపెనీ షేర్లు రూ.159.25 వద్ద ముగిశాయి. గత మూడు నెలల్లో చూస్తే కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ షేర్లు దాదాపు 120 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేర్లు దాదాపు 88 శాతం పెరిగాయి. అలాగే కొఠారి ఇండస్ట్రియల్ షేర్లు గత ఒక నెలలో 27 శాతం పెరిగాయి.
LIC కూడా కంపెనీపై బెట్ వేసింది: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌పై పెద్ద బెట్ వేసింది. కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌లో LICకి 14,71,629 షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీలో ఎల్‌ఐసికి 1.89 శాతం వాటా ఉంది. ఈ షేర్ హోల్డింగ్ డేటా డిసెంబర్ 2024 త్రైమాసికం వరకు.


Click it and Unblock the Notifications