21 రోజుల్లోనే భారత ఆర్థిక వ్యవస్థకు రూ.4.8 లక్షల కోట్ల నష్టం
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మొదట ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఆ తర్వాత మే 3వ తేదీ వరకు పొడిగించింది. ఏప్రిల్ 20వ తేదీ నుండి కొన్ని మినహాయింపులు ఉండనున్నాయి. లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. లాక్ డౌన్ ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుందనే ట్రంప్ మొదట నో చెప్పారు. కానీ జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో వెనుకడుగు వేశారు. భారత్‌లో పరిస్థితి భిన్నం. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవచ్చు.. కానీ ప్రాణాలు పోతే తీసుకురామని భావిస్తోంది. ఇదే బాటలో ప్రపంచంలోని ఎన్నో దేశాలు నడిచాయి.

భారత ఆర్థిక వ్యవస్థకు రూ.4.8 లక్షల కోట్ల నష్టం
లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.4.8 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని IIT-బాంబే రీసెర్చ్ టీమ్ అంచనా వేసింది. ఇప్పటికే వివిధ సంస్థలు లక్షల కోట్ల నష్టం ఉంటుందని చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికే ఏకంగా రూ.1 లక్ష కోట్లు, విమానయాన రంగానికి రూ.70వేల కోట్ల నష్టమని వివిధ సంస్థలు వెల్లడించాయి.

ఈ రాష్ట్రాలలో భారీ దెబ్బ
ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలపై భారీగా ప్రభావం పడుతుందని ఐఐటీ-బాంబే రీసెర్చ్ టీమ్ అంచనా వేసింది. వినియోగంపై భారీగా ప్రభావం పడిందని తెలిపింది. మూడు వారాల లాక్ డౌన్ వల్ల రూ.4.8 లక్షల భారమని అంచనా వేయగా.. పొడిగింపు నేపథ్యంలో ఈ నష్టం మరింతగా ఉండనుంది.

ప్యాకేజీ
లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి, డిమాండ్ పడిపోవడంతో కంపెనీలు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 80 కోట్ల మంది పేదల కోసం కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పుడు కార్పోరేట్స్‌తో పాటు పేదల కోసం మరింత ప్యాకేజీని సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications