అల్బేనియాలో జన్మించి, అమెరికాలో స్థిరపడిన మిరా మురాటి ప్రస్తుతం ప్రపంచ AI రంగాన్ని ప్రభావితం చేస్తున్న ప్రముఖులలో ఒకరు. OpenAI సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమె, ఇప్పుడు "Thinking Machines Lab" అనే సొంత AI స్టార్టప్‌ను స్థాపించి మరింత చర్చనీయాంశంగా మారారు. ఇటీవల facebook తల్లి సంస్థ Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ ఆమెను టీమ్‌తో సహా చేర్చుకునేందుకు $1 బిలియన్ ఆఫర్ చేసినా, ఆమె దీన్ని తిరస్కరించారు. ఇది ఆమె విజన్‌పై, మరియు తన స్టార్టప్ భవిష్యత్తుపై ఉన్న విశ్వాసాన్ని చాటుతోంది.

మిరా మురాటి OpenAIలో పనిచేసేటప్పుడు ChatGPT, DALL·E, Codex వంటి విప్లవాత్మక AI టూల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆమె మార్గనిర్దేశనతోనే జనరేటివ్ ఎయిర్ టూల్స్ సాధారణ ప్రజలలోకి వెళ్ళాయి. ఈ టెక్నాలజీలు విద్య, ఆరోగ్యం, డిజైన్, కోడింగ్ వంటి అనేక రంగాలలో వాడకాన్ని పెంచాయి.
ఆమె కేవలం టెక్నికల్ నేతృత్వమే కాదు, వ్యూహాత్మక ఆలోచనలతో కూడిన నాయకత్వాన్ని ప్రదర్శించారు. AI విషయంలో బాధ్యతాయుత అభివృద్ధి, భద్రత, మానవ హితాన్ని మిరా ఎప్పుడూ ముందుపెట్టారు. అందుకే ఆమెను OpenAIలో "AI బ్రెయిన్" అని పిలిచేవారు.
2025 ప్రారంభంలో మిరా "Thinking Machines Lab" అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు ఒక్క ఉత్పత్తిని కూడా విడుదల చేయకపోయినా, ఇప్పటికే అండ్రీసెన్ హోరోవిట్జ్ (Andreessen Horowitz) లాంటి పెట్టుబడిదారుల నుండి $2 బిలియన్ నిధులు సమీకరించి, దాదాపు $12 బిలియన్ వ్యాల్యూయేషన్ సాధించింది. ఈ సంస్థ లక్ష్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే, అర్థవంతమైన, మార్పులకు అనుకూలమైన AI సిస్టమ్‌లు అభివృద్ధి చేయడం.
Meta ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారు?
Wired మ్యాగజైన్ ప్రకారం, మిరా మురాటి టీమ్‌కు Meta సంస్థ $200 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు ఆఫర్లు ఇచ్చిందట. కానీ టీమ్‌లో ప్రతి ఒక్కరు ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. దీనికి ప్రధాన కారణం తమ స్టార్టప్‌లో ఉన్న ఈక్విటీ భవిష్యత్తులో దీన్నికంటే ఎక్కువ విలువ కలిగించగలదన్న నమ్మకం. పైగా, మిరా మురాటి ఇచ్చే స్వేచ్ఛ, దిశ, పెద్ద కంపెనీలపై ఆధారపడని ప్రయోగాత్మక వాతావరణాన్ని వారు మరింత విలువైనదిగా భావిస్తున్నారు.
AI రంగంలో మరింత డబ్బులు లక్ష్యంగా పెట్టుకునే కాలంలో, మిరా టీమ్ చూపిన ఈ విధమైన విశ్వాసం చాలా అరుదైన విషయం. వారు డబ్బుకంటే విజన్‌ను ప్రాధాన్యత ఇచ్చారు.
మిరా మురాటి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2023లో Fortune జాబితాలో '100 Most Powerful Women in Business', 2024లో Time మ్యాగజైన్ జాబితాలో '100 Most Influential People in AI' గా ఎంపికయ్యారు.
Thinking Machines Lab కంపెనీ వేగంగా ముందుకెళ్తుండగా, మేటా వంటి దిగ్గజ కంపెనీల బిలియన్ డాలర్ ఆఫర్లను తిరస్కరించడంతో మిరా ఒక AI సృష్టికర్తగా మాత్రమే కాదు - భవిష్యత్తు AI దిశను నిర్ణయించే నాయకురాలిగా గుర్తింపు పొందారు.
AI అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, అది మానవ విలువలతో కూడిన విజన్ కావాలి అని మిరా ప్రపంచానికి చూపించారు. ఇది ఆమె నాయకత్వంలోని Thinking Machines Labను, మరియు ఆమెను, భవిష్యత్తు AI రంగంలో ముఖ్యమైన పేరు చేస్తుంది.


Click it and Unblock the Notifications