క్రెడిట్ కార్డు అంటే చాలామందికి బకాయిలు, వడ్డీలు, EMIలు గుర్తొస్తాయి. కానీ హైదరాబాద్‌కు చెందిన మనీష్ ధమేజా మాత్రం ఈ కార్డులను భయపడకుండా తెలివిగా వాడి ప్రపంచానికి ఉదాహరణగా నిలిచాడు. ఎవరికైనా గరిష్టంగా 2-3 క్రెడిట్ కార్డులే ఉంటాయి. కొంతమందికి ఎక్కువ అంటే 10 వరకు. కానీ మనీష్ దగ్గర ఉన్న కార్డుల సంఖ్య విన్న వెంటనే మీరు షాక్ అవుతారు "ఒకటి కాదు... రెండూ కాదు... మొత్తం 1,638 యాక్టివ్ క్రెడిట్ కార్డులు!"
ఇంత పెద్ద సంఖ్యలో యాక్టివ్ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటంతో మనీష్ ధమేజా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇవన్నీ షో కోసం కాదు తను నిజంగానే వాడుతున్న యాక్టివ్ కార్డులే.

మనీష్ ధమేజా క్రెడిట్ కార్డుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన మాటల్లోనే ఒక ప్రత్యేకమైన ప్రేమ కనిపిస్తుంది. "క్రెడిట్ కార్డులు నాకు కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదు. అవంటే నాకు నిజంగా ఇష్టం. ఇవి నా రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒకరోజు కూడా కార్డులు లేకుండా ఉంటే ఏదో మిస్సయ్యిన ఫీలింగ్ వస్తుంది" అని ఆయన చెబుతున్నాడు.
అతని మాటల్లో ఈ కార్డులు ఆయన జీవితానికి ఒక కొత్త అనుభవాన్ని తీసుకువచ్చాయి. షాపింగ్ నుంచి ట్రావెల్ వరకు ఎక్కడైనా ఈ కార్డులు ఆయనకు ఉపయోగపడుతూనే ఉంటాయి. పైగా వీటివల్ల వచ్చే క్యాష్‌బ్యాక్‌లు, గిఫ్ట్ వోచర్లు, ట్రావెల్ పాయింట్లు, డిస్కౌంట్లు లాంటి ప్రయోజనాలు ఆయనను మరింత ఆకర్షించాయి. "ఒక కార్డు వల్ల ఒక రివార్డ్ వస్తే ఆనందంగా ఉంటుంది. మనీష్‌కి ఇవి కేవలం కార్డులు కావు ఆయనకు ఇవి హాబీ, ప్యాషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే ఒక సాధనం. అందుకే ఈ కార్డులను ఆయన ఇంత ప్రేమతో సేకరించి, తెలివిగా వాడుతూ రికార్డే సృష్టించాడు.
2016లో దేశంలో నోట్ల రద్దు జరిగినప్పుడు, అందరిలా మనీష్ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అప్పుడు ఆయన క్యాష్ బదులు "డిజిటల్ పేమెంట్స్" వైపు మళ్లాడు. అక్కడి నుంచే క్రెడిట్ కార్డులతో ఆయన ప్రయాణం మొదలైంది. మొదట చిన్న ఖర్చుల కోసం వాడటం ప్రారంభించాడు. తర్వాత క్రెడిట్ కార్డుల వల్ల వచ్చే క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్స్, ఆఫర్లు చూసి ఒక్కొక్కటిగా కార్డులు పెంచుకుంటూ చివరికి 1,638 వరకు చేరాడు.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
మనీష్‌కు క్రెడిట్ కార్డులు కేవలం షాపింగ్ కోసం మాత్రమే కాదు, జీవితంలో అనేక రకాల ప్రయోజనాలు కూడా తెచ్చిపెట్టాయి. ఆయన చెబుతున్నట్లుగా, ఈ కార్డుల వల్ల ఫ్లైట్ టిక్కెట్ల పై డిస్కౌంట్లు, హోటల్ వోచర్లు లాంటి ఆఫర్లు అందుతుంటాయి. అంతేకాదు ప్రయాణాల సమయంలో విమానాశ్రయాలు, రైల్వే లాంజ్‌లలో ఉచితంగా లేదా తక్కువ ధరకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఫుడ్, స్పా వంటి సేవల పైనా ప్రత్యేక ఆఫర్లు వస్తాయి.
అలాగే, షాపింగ్ వోచర్లు, సినిమా టిక్కెట్లు, గోల్ఫ్ సెషన్ల వరకూ అనేక రకాల రివార్డ్స్, డిస్కౌంట్లు ఆయనకు లభిస్తాయి. ఇలా ఒక్కో కార్డు ద్వారా వచ్చే చిన్న చిన్న బెనిఫిట్స్ కలిపి పెద్ద మొత్తంలో ప్రయోజనాలను అందిస్తున్నాయని మనీష్ చెబుతున్నాడు. అందుకే ఆయనకు ఈ క్రెడిట్ కార్డులు కేవలం పేమెంట్ టూల్స్ కాకుండా, జీవనశైలిని మెరుగుపరిచే ఒక స్మార్ట్ సిస్టమ్‌గా మారాయి.
మనీష్ చెప్పేది సింపుల్ ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఎంత ఎక్కువగా ఉన్నాయన్నది ముఖ్యం కాదు, వాటిని ఎలా వాడుతున్నామన్నది నిజంగా ముఖ్యమని ఆయన చెబుతున్నాడు. సరైన పద్ధతిలో, జాగ్రత్తగా వాడితే, ఇవి మనపై భారం కాకుండా మనకు ప్రయోజనాలు, రివార్డ్స్, సౌకర్యాలు అందించే ఒక శక్తివంతమైన టూల్ అవుతుంది. మనీష్ తన అనుభవంతో చూపించిందేమిటంటే, క్రెడిట్ కార్డులు సరియైన రీతిలో వాడితే డెబ్ట్ ట్రాప్ కాకుండా స్మార్ట్ ఫైనాన్స్ కోసం గొప్ప సాధనం అవుతాయి. మొత్తం మీద మనీష్ ధమేజా కథ చెప్పే సందేశం క్రెడిట్ కార్డులు మనపై కాదు, మనం వాటి పై కంట్రోల్ ఉంచుకుంటే అవి మన లైఫ్‌ను ఈజీగా, స్మార్ట్‌గా మార్చేస్తాయి.
More From GoodReturns

రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గదా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications