Bengaluru Metro: రికార్డు సృష్టించిన బెంగళూరు మెట్రో.. ఒక్క రోజే మెట్రోలో ప్రయాణించిన 11.2 లక్షల మంది ..

బెంగళూరు మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించారు. సోమవారం ఆగస్టు 10న మెట్రోలో అత్యధిక ప్రయాణికుల ప్రయాణం చేశారు. ఒక్క రోజులోనే మూ మూడు లైన్లలో దాదాపు 11.2 లక్షల మంది ప్రయాణించారు. ఇంతకుముందు అత్యధిక ప్రయాణికుల సంఖ్య 2025 ఆగస్టు 14న నమోదైంది. అప్పుడు ఒక్క రోజులు 10.8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. వారాంతం తర్వాత ప్రజలు నగరానికి తిరిగి రావడం, సాధారణ ఆఫీసు రద్దీ, వర్షం, ఇతర కారణాల వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ఈ ప్రజాదరణ పొందిన రవాణా మార్గాన్ని ఎంచుకోవడంతో సోమవారం నాడు రికార్డు స్థాయి ప్రయాణికులు ప్రయాణించారని అధికారులు తెలిపారు.

లైన్ల వారీగా పర్పుల్ లైన్‌లో అత్యధికంగా 4,66,371 మంది ప్రయాణించగా, ఆ తర్వాత గ్రీన్ లైన్‌లో 2,85,499 మంది, ఎల్లో లైన్‌లో 92,838 మంది ప్రయాణించారు. మెజెస్టిక్, ఆర్‌వి రోడ్ ఇంటర్‌చేంజ్ స్టేషన్లలో 2,75,107 మంది ప్రయాణికులు ఎక్కారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రస్తుతం 83 స్టేషన్లతో 96 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. సోమవారం ప్రయాణించిన ప్రయాణికులలో దాదాపు 2.8 లక్షల మంది టోకెన్లు కొనుగోలు చేయగా, 2 లక్షల మంది NCMC కార్డులను, దాదాపు 1 లక్ష మంది QR టిక్కెట్లను ఉపయోగించారు. మిగిలిన ప్రయాణికులు ఇతర టిక్కెటింగ్ పద్ధతులను ఉపయోగించారు.

Metro

ప్రయాణికులు రికార్డు స్థాయిలో ప్రయాణించినప్పటికీ, ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌పై పడుతున్న ఒత్తిడి గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మెజెస్టిక్, ఆర్‌వి రోడ్, ఇతర రద్దీ ఇంటర్‌ఛేంజ్‌ల వంటి ప్రధాన స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి, ముఖ్యంగా రద్దీ సమయాల్లో BMRCL రైళ్ల రాకపోకల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. రద్దీ సమయాల్లో భద్రతా తనిఖీలకు గణనీయమైన సమయం పడుతుందని చెబుతున్నారు. స్టేషన్లలోకి ప్రవేశించడానికి క్యూలలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.

రద్దీ సమయాల్లో క్యూలను నిర్వహించడానికి, ప్రవేశాన్ని వేగవంతం చేయడానికి BMRCL మరిన్ని స్క్రీనింగ్ యంత్రాలను, అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు ఉన్న 19 కిలోమీటర్ల ఎల్లో లైన్ మంగళవారం నాటికి తన కార్యకలాపాలను ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టులో చివరి మైలు కనెక్టివిటీ అమలు సరిగా లేకపోవడం, మెట్రోను ఇతర ప్రజా రవాణా మార్గాలతో, ముఖ్యంగా బీఎంటీసీ బస్సులతో సరిగ్గా అనుసంధానించకపోవడం వంటి లోపాలను సీఏజీ ఆడిట్ ఎత్తి చూపింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+