అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో MSMEలకు అండగా వైసీపీ ప్రభుత్వం కొత్త స్కీంను ప్రారంభించనుంది. ఏపీలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం వైయస్సార్ నవోదయం పేరిట కొత్త పథకం తెచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న MSMEలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు.

రూ.4వేల కోట్ల వన్ టైమ్ రీస్ట్రక్చర్
ప్రభుత్వం జిల్లాలవారీగా మొత్తం 86వేల MSMEల ఖాతాలను గుర్తించింది. రూ.4 వేల కోట్ల రుణాలను వన్ టైమ్ రీస్ట్రక్చర్ చేస్తారు. NPAలుగా మారకుండా, అకౌంట్స్ ఫ్రీజ్ కాకుండా చర్యలు తీసుకోనున్నారు. దీంతో MSMEలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం ఏర్పడుతుంది. అవకాశాన్ని వినియోగించుకునేందుకు MSMEలకు తొమ్మిది నెలల వ్యవధి ఇస్తారు.

ఉచిత కరెంట్
ఏపీ కేబినెట్ భేటీలో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఎస్సీలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయాలని నిర్ణయించారు. దీంతో పదిహేను లక్షలమంది ఎస్సీ కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం రూ.411 కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పెట్టుబడుల కోసం కొత్త యాక్ట్
ఏపీఈడీబీ 2018 చట్టాన్ని రద్దు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దానికి బదులు ఏపీ పెట్టుబడుల ప్రమోషన్, అండ్ మానిటరింగ్ యాక్టు (APIPM)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, ప్రాజెక్టుల అనుమతి, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications