Business Ideas: ఈరోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్ టాప్స్ వినియోగిస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఎక్కడి నుంచైనా క్రయవిక్రయాలు చేసుకునేందుకు వ్యాపారాలకు అవకాశం లభిస్తోంది. అయితే ఇప్పుడు ఇది మహిళా వ్యాపారవేత్తలకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతోంది.
అవును ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆన్‌లైన్ బోటిక్ వ్యాపార ఆలోచన గురించి. మహిళలకు అందమైన బట్టలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్న అలాంటి ఫ్యాషన్ ప్రియులకు చేరువ కావటానికి ఫిజికల్ స్టోర్ పెట్టడం కంటే ఆన్ లైన్ స్టోర్ నిర్వహించటం ఉత్తమమైన నిర్ణయం. తద్వారా ఇంటి వద్దనే ఉంటూ మహిళలు తమకు ఇష్టమైన డిజైనరీ బట్టల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది లైఫ్, వర్క్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది.

ఇలా చేయటం వల్ల భౌతికంగా స్టోర్ ఏర్పాటు, దానికి అద్దె, మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు లేకుండానే మహిళలు తమకు ఇష్టమైన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పైగా సోషల్ మీడియా పేజీల ద్వారా మీ వ్యాపారాన్ని సులువుగా కస్టమర్ల వరతు చేర్చవచ్చు. దీనికోసం మీరు చాలా తక్కువగా పనిచేయాల్సి ఉంటుంది.
ఈ ఆన్‌లైన్ దుస్తుల దుకాణాల్లో అధిక-నాణ్యత, అధునాతన ఉత్పత్తులను సాంప్రదాయ రిటైల్ స్టోర్ల కంటే మంచి ధరలకు వకి్రయించుకోవచ్చు. అయితే దీనిని ప్రారంభించటానికి ప్రారంభంలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు వాడే మెటీరియల్స్, వాటి నాణ్యత, మీరు అందించే వివిధ రకాల ఉత్పత్తుల ఆధారంగా పెట్టుబడి మెుత్తం మారుతుంటుంది.
పెళ్లిళ్లకు, పుట్టినరోజులకు లేదా ఇతర సందర్భాల్లో మహిళలు ప్రస్తుతం డిజైనర్ వేర్ ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువల్ల ఈ వ్యాపారం ద్వారా నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించవచ్చు. ఎన్ని ఎక్కువ ఆర్డర్లు డెలివరీ చేయగలిగితే అంత ఎక్కువ సంపాదించుకునేందుకు మహిళలకు వెసులుబాటు ఉంటుంది.


Click it and Unblock the Notifications