Business Ideas: ఈ రోజుల్లో మహిళలు సైతం తమకు ఇష్టమైన వ్యాపారాలను ప్రారంభించి వ్యాపారవేత్తలు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే మారిన టెక్నాలజీ వారికి ఇంటి వద్ద నుంచే డబ్బు సంపాదించుకునేందుకు అనేక అవకాశాలను తెచ్చిపెడుతోంది. గతంలో లాగా అవకాశాల కోసం లేదా వేరొకరి సహాయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
అవును ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆన్ లైన్ బేకరి వ్యాపారం గురించే. చాలా మంది మహిళలు పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆహారాలు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తులు, ఐస్ క్రీమ్స్ వంటివి తయారు చేయటం ఇష్టపడుతుంటారు. అయితే వీటిని విక్రయించేందుకు గతంలో లాగా షాపు పెట్టడం.. అద్దులు కట్టడం లాంటి భారీ ఖర్చులు అవసరం ఉండదు.

ముందుగా బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించటానికి కొన్ని మెషిన్లు, పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బేకింగ్ ఓవెన్, కేక్ మిక్సింగ్ మెషిన్, క్రీమ్ మేకింగ్ మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు అవసరమైన ముడి సరుకులు, రంగులు, డాల్డా, బటర్, మైదా, చక్కెరతో పాటు ఇతర కాన్ఫిక్షనరీ వస్తువులను కొనుగోలు చేయాలి.
తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాలను పిల్లలకు అందించాలని ప్రస్తుతం కోరుకుంటున్నారు. అయితే ఇది మహిళలు ఆన్ లైన్ బేకరీ వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. రుచికరమైన బ్రెడ్స్, కేక్స్, పఫ్స్, బిస్కెట్లు, కప్ కేక్స్, కూల్ కేక్స్, డిజైనరీ కేక్స్ వంటి వాటిని ఆన్ లైన్ ద్వారా ముందస్తు ఆర్డర్స్ తీసుకుని సరఫరా చేయవచ్చు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్ ఫ్లేవర్లో రుచికరమైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు.
ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించటానికి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. మంచి పేరుతో పాటు వ్యాపారాన్ని పెంచుకున్నట్లయితే నెలకు దాదాపు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇంటి వద్ద తమకు ఉండే ఖాళీ సమయాన్ని ఫలవంతంగా వినియోగించుకుని డబ్బు సంపాదించాలనుకునే మహిళలకు ఇదొక మంచి వ్యాపార ఆలోచన. పైగా బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ప్రభుత్వం అందించే రుణ పథకాలు కూడా ఉన్నాయి. వీటిని వినియోగించుకుని వ్యాపారంలో మంచిగా రాణించవచ్చు.


Click it and Unblock the Notifications