Business Ideas: 365 రోజులు డిమాండ్ ఉండే వ్యాపారం.. మహిళలకు మంచి ఆదాయం..
Business Ideas: మహిళలు ఇంటి వద్ద నుంచే మంచి సంపాదనను ఆర్జించేందుకు ఈ రోజుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆహార రంగంలో ప్రస్తుతం అనేక వ్యాపార ఆలోచనలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ప్రతినెల ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ వ్యాపారం గురించే. ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. దీనికోసం ప్రాథమికంగా రూ.లక్ష పెట్టుబడి అవసరం ఉంటుంది. ప్రతినెల రూ.50,000 వరకు ఆదాయం పొందవచ్చు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి ఒక గ్రైండింగ్ మెషిన్ ఒకటి కొనాలి. దీనికి తోడు ప్యాకింగ్ మెటీరియల్, సీలింగ్ మెషిన్, ఖాళీ బాటిళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ అల్లం, వెల్లుల్లిని మార్కెట్లో కొనుగోలు చేసి తయారీలో వినియోగిస్తే వినియోగదారుల నుంచి డిమాండ్ త్వరగా పెరుగుతుంది. ప్రతిరోజూ చేసే అనేక వంటకాల్లో ప్రజలు, హోటల్ వ్యాపారులు దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు.
మీకు సమీపంలోని మార్కెట్లో షాపులకు, హోల్ సేల్ దుకాణాలకు ఎక్కువ మెుత్తంలో ఆర్డర్లు తీసుకుని సప్లై చేయటం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అయితే క్వాలిటీ ఉత్పత్తిని అందిస్తే మార్కెట్లో త్వరగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. దీనికోసం ఎక్కువ మంది ఉద్యోగులు కూడా అవసరం ఉండదు. ఒక కుటుంబం దీనిపై ఉపాధి పొందవచ్చు.
ప్రధానంగా నగరాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వినియోగం అధికంగా ఉంటుంది. బ్యాచిలర్లు, ఉద్యోగులు, హాస్టళ్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉత్పత్తిని అందుబాటులో ఉండేలా చూడటం వల్ల మంచి అమ్మకాల టర్నోవర్ పొందవచ్చు. దీనిని మహిళలు ఇంట్లోనే ఒక గదిలో తయారీ యూనిట్ ను ప్రారంభించవచ్చు.


Click it and Unblock the Notifications