Business Ideas: ప్రస్తుతం మారుతున్న జీవితవిధానంతో పాటు ఉద్యోగాల కోసం ఊరు విడిచి పట్టణాలకు అనేక మంది వలస రాక తప్పటం లేదు. ఈ క్రమంలో చిన్ననాటి చిరుతిళ్లకు చాలా మంది దూరమౌతున్నామని ఫీలవుతున్నారు. పైగా కరోనా తర్వాత చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో బయటి ఆహారాలను తగ్గించి హోమ్ ఫుడ్ తినేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ అవకాశం మహిళలకు ఇంటి నుంచే డబ్బు సంపాదించుకునేందుకు వీలు కల్పిస్తోంది.
మనలో ఇప్పటికీ ఎక్కడ ఉన్నా ఇంట్లో చేసిన చిరుతిళ్లు అంటే చాలా ఇష్టం. ఎంత ఖరీదైన స్వీట్ షాపులోని ఉత్పత్తులను కొనుక్కుని తిన్నా ఆ రుచి రాదు. పైగా టెక్నాలజీ పెరగటం, ఆన్ లైన్ పద్ధతులు రావటంతో మనం ప్రపంచంలో ఏ మూలనుంచైనా వ్యాపారాన్ని కొనసాగించొచ్చు. కావలసిందల్లా కస్టమర్ల నుంచి మంచి గుర్తింపు, ఆధరణ మాత్రమే. ఇలా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాం.. అక్కడే ఉంటూ సంపాదించుకోవలనుకునే మహిళలకోసం ఒక మంచి ఫుడ్ బిజినెస్ ఐడియా ఉంది.

అవును ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అచ్చతెలుగు హోమ్ మేడ్ స్నాక్స్ వ్యాపారం గురించే. ఇళ్లలో పరిశుభ్రంగా తయారు చేసే మురుకులు, బొబ్బట్లు, అరిసెలు, లడ్డూలు, సున్నుండలు, పూతరేకులు, కారప్పూస, మిచ్చర్, బూందీ, పకోడీలు, చెకోడీలు, మైసూర్ పాక్, బాదుషా, కోవా, ఖజ్జికాయలు.. ఇలా చెప్పుకుంటూ చాలా రకాల ఆహారాలకు చాలా పెద్ద డిమాండ్ ఉంది. పాటించాల్సిందల్లా రుచి శుచి మాత్రమే. ఇళ్లవద్ద మహిళలు ముందుగా ఆర్డర్లు తీసుకుని వీటిని కావలసిన కస్టమర్లకు కొరియర్ ద్వారా పంపి మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
మెుదట్లో గుర్తింపు రావటానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ.. ఒక్కసారి టేస్ట్ నచ్చితే అది ఆనోట ఈనోట పాకి చాలా మందికి చేరుతుంది. ఇప్పటికే చాలా మంది ఇలాంటి వ్యాపారాలను ప్రారంభించి నెలకు లక్షల్లో డబ్బును సంపాదిస్తున్నారు. పైగా మన తెలుగించి రుచులంటే చాలా మందికి ఇష్టం. ప్రధానంగా నగరాల్లో బిజీ జీవితాలను గడుపుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఇలాంటి ఇంటి ఆహారాలను తినేందుకు ఎక్కువగా ఈరోజుల్లో ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇంటి దగ్గరే ఉంటూ బిజినెస్ ఉమెన్ గా ఎదిగేందుకు అవకాశం ఉన్న ఈ వ్యాపార అవకాశం గురించి మహిళలు ఒక్కసారి ఆలోచిస్తే కొంత కాలంలోనే వారు ఊహించని స్థాయికి వ్యాపారాన్ని తీసుకెళ్లగలరు. లేడీస్ ఒక్కసారి ఆలోచించండి మీలో దాగి ఉన్న శక్తి ఏంటో మీరూ తెలుసుకోండి.


Click it and Unblock the Notifications