Business Ideas: మహిళలకు సెట్ అయ్యే అనేక వ్యాపార ఆలోచనలు అనేకం ఉప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే సృజనాత్మకత కలిగిన మహిళలకు మాత్రం ఆన్‌లైన్ వేదికగా అనేక వ్యాపార అవకాశాలు ప్రస్తుతం ఆహ్వానం పలుకుతున్నాయి. వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించుకునేందుకు ఇవి దోహదపడుతున్నాయి.
ఇంటి దగ్గరే ఉంటూ అదనపు ఆదాయం కోసం చూస్తున్న మహిళామణులకు క్యాండిల్స్ మేకింగ్ వ్యాపారం అద్బుత అవకాశాలను అందిస్తోంది. దీనిని కనీసం రూ.50,000 ప్రారంభ పెట్టుబడితో మహిళలు ఇంటి వద్ద నుంచే ప్రారంభించవచ్చు. అలాంకార ప్రియులను టార్గెట్ చేసుకుంటూ అనేర రకాల క్యాండిల్స్ తయారు చేస్తే తిరుగులేని ఆదాయం పొందవచ్చు.

ప్రస్తుతం క్యాండిల్స్ గిఫ్టింగ్ భారీగా పెరిగింది. కార్పొరేట్ ఆఫీసుల్లో రకరకాల ఆకృతులు, రంగులు, సువాసనలు ఉండే రకరకాల కొవ్వొత్తులను అందిస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, హోటళ్లలో కూడా వీటి వినియోగం భారీగా పెరిగింది. అలాగే వ్యక్తులు సైతం మానసికంగా ప్రశాంతత పొందేందుకు లావెండర్, జాస్మిన్, రోజ్ వంటి సువాసనా భరితమైన కొవ్వొత్తులను ఇళ్లలో వెలిగిస్తున్నారు.
వ్యక్తిగతంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా విక్రయాలను చేయటంతో పాటు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి మాద్యమాల్లో అమ్మటం ద్వారా ఎక్కువ సేల్స్ చేయవచ్చు. ప్రస్తుతం ఇలాంటి ఉత్పత్తులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. అలంకార ప్రియులు వీటి కొనుగోలుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కార్పొరేట్ సంస్థలు, హోటళ్ల నుంచి భారీగా ఆర్డర్లను అందుకుని సప్లై చేయటం ద్వారా వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయం పొందవచ్చు.
మనం ఇందుకోసం అవసరమైన రంగులు, వ్యాక్స్ బేస్, ఎసెన్సియల్ ఆయిల్స్, ప్యాకింగ్ మెటీరియల్ తో పాటు ఇతర సామాగ్రిని ముందుగా ఇందుకోసం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించటానికి ముందుగా ఇదే తరహాలో ఆన్ లైన్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారిని గమనించటం, వారి ఉత్పత్తుల ధరలను తెలుసుకోవటం వేగంగా వృద్ధి చెందటానికి ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications