భారతదేశ ఐటీ రంగం నేల చూపులు చూస్తోంది. ఐటీ వృద్ధికి మరోసారి భారీగానే ఎదురుదెబ్బ తగిలింది. Q1 FY26లో నియామకాలు 72% క్షీణతను చూశాయి. క్లుప్తంగా చెప్పాలంటే 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికం భారతదేశ ఐటీ రంగానికి తీవ్ర నిరాశను మిగిల్చింది.280 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ రంగంలోని టాప్-6 ఐటీ సంస్థలు ఏప్రిల్-జూన్ కాలంలో కేవలం 3,847 ఉద్యోగులను మాత్రమే కొత్తగా కంపెనీల్లోకి చేర్చుకోగలిగాయి. ఇది మునుపటి త్రైమాసికంలో నమోదైన 13,935 నియామకాల నుండి దాదాపు 72% తగ్గుదలగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యంతో పాటుగా కంపెనీ భయాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
భారతదేశంలో టాప్ లో దూసుకుపోతున్న ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ ఏడాది తన నియామకాలను భారీగా తగ్గించింది. కేవలం 5,060 మంది ఉద్యోగులను మాత్రమే కొత్తగా చేర్చుకుంది. ఇది కంపెనీకి చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. ఇక మరో దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది లేఆప్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఉద్యోగులను చేర్చుకునే దాని మీద దృష్టిని పెట్టలేదు. కేవలం 210 మందిని మాత్రమే ఈ ఏడాది నియమించుకుంది. ఇది కంపెనీకి చాలా తక్కువగా చెప్పుకోవచ్చు.ఇక టాప్ ఐటీ దిగ్గజాలు Wipro, HCLTech, Tech Mahindra, LTIMindtree వంటి కంపెనీలు అన్నీ కలిపి కూడా 1,423 మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకున్నాయి.

ఇది కేవలం బలహీన గ్లోబల్ డిమాండ్ వల్ల మాత్రమే కాదని చెప్పుకోవచ్చు. కంపెనీలు ఇప్పుడు AI (కృత్రిమ మేధస్సు), ఆటోమేషన్, అభివృద్ధి చెందిన టెక్నాలజీలను మరింతగా వినియోగించుకుంటూ, తక్కువ వనరులతో ఎక్కువ పనితీరును లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనివల్ల Entry-Level నియామకాలు గణనీయంగా తగ్గాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తీసేసి ఏఐ ద్వారా నడిపిస్తున్నాయి.
TeamLease Digital CEO నీతి శర్మ మాట్లాడుతూ.. FY26 కోసం ఉద్యోగులను తీసుకోవడం తగ్గుతున్నా.. నియామకాలు స్పష్టంగా నైపుణ్యాధారితంగా ఉంటాయన్నారు. మునుపటి వాల్యూమ్ ఆధారిత Hiring పద్ధతులు తిరిగి రావడం అనుమానమేనని చెప్పుకొచ్చారు. ఇక TeamLease డేటా ప్రకారం చూసినట్లయితే మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే Entry-Level నియామకాలు సగానికి తగ్గినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు కంపెనీలు వందలాదిగా ప్రాజెక్ట్‌లు తీసుకుంటూ పెద్దఎత్తున సిబ్బందిని తీసుకునేవి. ఇప్పుడు ఆ స్థితి లేదు. అన్ని పెద్ద కంపెనీలు మెల్లగా, అవసరమైన చోట మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి.
ఐటీ ఇండస్ట్రీ మొత్తం మీద చూసుకుంటే ఈ ఆరు కంపెనీలు ఇప్పటికీ కలిపి 16.25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇది 2022 జూన్ చివరిలో నమోదైన 16.58 లక్షల ఉద్యోగాల కంటే తక్కువగా చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగ మార్కెట్ ఇప్పటికీ కరోనా కన్నా ముందు స్థితికి ఇంకా చేరుకోలేదు.ఈ గణాంకాలు భారతదేశ ఐటీ రంగానికి డేంజర్ జోన్ చూపిస్తున్నాయి. టాప్ కంపెనీలన్నీ ఏఐ మీద పెట్టుబడులు పెడుతూ ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. దీంతో కాలేజీ నుంచి పట్టా పట్టుకుని బయటకు వస్తున్న వారికి ఉద్యోగం అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఏడాది ఆరు నెలల్లోనే కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి.రాబోయే కాలంలో నియామకాలు ఎక్కువగా నైపుణ్యం ఆధారితంగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు ఉన్నా అధిక జీతాలతో ఉండనున్నాయని నిపుణులు చెబుతున్నారు. AI మీద ఎక్కువగా ఆధారపడటం, క్లయింట్ల తీరులో మార్పు కొత్త నియామకాలపై ప్రభావం చూపుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications