Business Ideas: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలను ప్రారంభించేవారిని కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తోంది. అయితే వాటిని సామాన్యులకు అవి పొందటం అంత సులవు కాదు. అనేక స్కీమ్స్ కొత్తగా ప్రారంభించేవారికి రుణాలను ఇస్తామని చెప్పినప్పటికీ.. ఎక్కువ శాతం ఇప్పటికే వ్యాపారాలను ప్రారంభించిన వారికి అవి అందుతున్నాయి.
ప్రధాన మంత్రి ముద్రా యోజన, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫండ్, జెడ్ సర్టిఫికేట్ స్కీమ్ కింద MSMEలకు లోన్ అసిస్టెన్స్, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం లోన్ లింక్డ్ క్యాపిటల్ గ్రాంట్ వంటి కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ పథకాల కింద చిన్న వ్యాపారాలను ప్రారంభించేవారు సులువుగా లోన్స్ పొందవచ్చు.

అప్పడాల తయారీ..
ఎవరైనా తమ ఇంటి వద్దే అప్పడల తయారీ వ్యాపారాన్ని సులువుగా ప్రారంభించవచ్చు. ఈ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించటానికి రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవసరం. అదే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని అనుకుంటే యంత్రాల కొనుగోలుకు రూ.8.18 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీనికి తోడు Entrepreneurship Support Scheme స్కీమ్ కింద రూ.1.91 లక్షల గ్రాంట్ లభిస్తుంది.

విడిభాగాల వ్యాపారం..
చిన్న విడిభాగాల విక్రయించటం ఈ రోజుల్లో మంచి వ్యాపారంగా నడుస్తోంది. వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువుల విడిభాగాలు, నట్లు, బోల్టులు, వాషర్లు వంటి విడిభాగాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించవచ్చు. దీనిని ప్రారంభించటానికి రూ.1.88 లక్షలు అవసరమౌతుంది. ఇందులో ఏడాదికి రూ.2 లక్షల వరకు ఆర్జించవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లోన్ సౌకర్యాన్ని పొందవచ్చు.

మసాలా పొడుల తయారీ..
ఈ రోజుల్లో అందరూ రుచికరమైన ఆహారాలను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలా హోమ్ మేడ్ రుచికమైన కారం పొడులు, మసాలా పొడులకు మంచి డిమాండ్ పెరిగింది. ఇంటి వద్ద తయారు చేసిన ఇలాంటి వాటిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ వ్యాపారాన్ని ఇంటి వద్దనే ప్రారంభించటానికి సుమారు రూ.1.66 లక్షల ప్రారంభ పెట్టుబడి అవసరం. ఈ కుటీర వ్యాపారానికి బ్యాంకులు సైతం రుణాన్ని అందిస్తున్నాయి.

ఫర్నిచర్ వ్యాపారం..
చిన్నపాటి ఫర్నిచర్ దుకాణాన్ని నడపటానికి రూ.1.85 లక్షలు ప్రారంభ పెట్టుబడితో మెుదలు పెట్టవచ్చు. ముద్ర స్కీమ్ కింద బ్యాంకు నుంచి లోన్ కూడా పొందవచ్చు. ప్రారంభం నుంచే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.

టిఫిన్ షాప్..
దేశంలోని పట్టణాలు, సబర్బన్ ప్రాంతాల్లో టిఫిన్ షాప్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. దీని కోసం లక్షల్లో పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న షాప్ ఓపెన్ చేయటానికి ముందు ఇంటి దగ్గర కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

బేకరీ బిజినెస్..
బేకరీ ఆహార ఉత్పత్తులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దీనిని సుమారు రూ.3 నుంచి రూ.4 లక్షల వ్యయంతో ప్రారంభించవచ్చు. దీనికి కొన్ని యంత్రాలు కూడా అవసరం అవుతాయి. అయితే యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినటానికి మక్కువ చూపుతున్నందున ఈ వ్యాపారం మంచి లాభదాయకమైనదని చెప్పుకోవచ్చు. దీనికి సైతం కేంద్ర ప్రభుత్వం కింద ముద్ర లోన్ సులువుగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications