రూ.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీలను మైక్రో ఎంఎస్ఎంఈలుగా గుర్తిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. ప్రధాని మోడీ మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 13) మీడియాకు వివరించారు. ఒక్కో రంగానికి ఏ చర్యలు తీసుకున్నది రోజుకొకటి ప్రకటిస్తామన్నారు. ఈ రోజు MSMEలపై ప్రకటిస్తున్నట్లు చెబుతూ రూ.3 లక్షల కోట్లు వీటికి కేటాయించినట్లు తెలిపారు.
రూ.50 వేల కోట్లతో ఎంఎస్ఎంఈలకు నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎంఈలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు తాము తీసుకున్న అన్ని చర్యలు ఉపయోగపడతాయని ఆకాంక్షించారు.

ఎంఎస్ఎంఈల ఉత్పత్తి పెంపు కోసం రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.20వేల కోట్ల నగదు లభ్యత ఉంటుందన్నారు. మైక్రో యూనిట్స్ రూ.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగి ఉండవచ్చునని చెప్పారు. రూ.200 కోట్ల వరకు టెండర్లకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదన్నారు. సమాజంలోని వివిధ వర్గాలతో చర్చించాక ఆర్థిక ప్యాకేజీ విజన్‌ను రూపొందించినట్లు తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ధి దిశగా భారత్‌ను నడిపేందుకు ఈ ప్యాకేజీ అన్నారు. భారత్ స్వయంపూర్వకంగా ఎదగడమే లక్ష్యమన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications