Guaranteed Emergency Credit Line: రూ.8,700 కోట్లు పంపిణీ చేసిన ఎస్బీఐ

సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థల(MSME), వ్యాపార సంస్థలకు ఎమర్జెన్సీ గ్యారెంటీ క్రెడిట్ స్కీం కింద ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ.15,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది. 1.5 లక్షల ఎంఎస్ఎంఈలకు ఈ రుణాలు మంజూరు చేసినట్లు తెలిపింది. ఇందులో రూ.8,700 కోట్ల రుణాలు పంపిణీ చేశామని రెండు రోజుల క్రితం వెల్లడించింది. ఎంఎస్ఎంఈలు, వ్యాపార సంస్థల నిర్వహణ మూలధన పరిమితులను తాజాగా అంచనా వేయడం, రుణాలను పునర్ వ్యవస్థీకరించడం వంటి చర్యలు తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

కేంద్రం ప్యాకేజీలో ఈ వాటానే పెద్దది

కేంద్రం ప్యాకేజీలో ఈ వాటానే పెద్దది

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం రూ.3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం(ECLGS) తీసుకు వచ్చింది. మోడీ ప్రభుత్వం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎంఎస్ఎంఈల వాటానే పెద్దది. ఈ పథకం కింద అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు 100 శాతం గ్యారెంటీతో రుణాలు ఇస్తారు. ఇందులో భాగంగానే ఎస్బీఐ లక్షన్నర ఎంఎస్ఎంఈలకు పదిహేనువేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయగా, ఇందులో రూ.8700 కోట్లు పంపిణీ చేసింది.

ఎస్బీఐ ఈ-టౌన్ హాల్స్ సమావేశాలు

ఎస్బీఐ ఈ-టౌన్ హాల్స్ సమావేశాలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితులను అధిగమించేందుకు మద్దతు, ఇతర చర్యలను ఎంఎస్ఎంఈలకు వివరించేందుకు ఎస్బీఐ 125 ఈ-టౌన్ హాల్స్ సమావేశాలు నిర్వహించిందని ప్రతినిధులు తెలిపారు. వీటిలో దాదాపు 3వేల మందికి ఎంఎస్ఎంఈ ఖాతాదారులు పాల్గొన్నారని తెలిపారు.

ఉద్యోగుల్లో అవగాహన

ఉద్యోగుల్లో అవగాహన

చిన్న సంస్థలకు ఇచ్చే గ్యారంటీ ఎమర్జెన్సీ రుణాలపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యోగుల కోసం 120 వెబినార్లను ఎస్బీఐ నిర్వహించింది. మే నెలలో హైదరాబాద్, గురుగ్రామ్‌లోని జాతీయస్థాయి ఎస్బీఐ శిక్షణ కేంద్రాలు, 50 స్టేట్ బ్యాంకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్స్ 16,000 మంది ఉద్యోగులకు 841 వెబినార్ల ద్వారా ఎంఎస్ఎంఈ గ్యారెంటీ రుణంపై అవగాహన కల్పించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+