Business Ideas: మహిళలకు సదవకాశం.. ఇంటి వద్దే ఉంటూ రూ.2 లక్షలు సంపాదించొచ్చు..
Business Ideas: ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. రెండు చేతులా సంపాదిస్తే కానీ బతకటం గగనంగా మారిపోయింది. ఈ క్రమంలో చాలా మంది ఇంటి వద్దే ఉంటూ తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నారు.
సొంతంగా తక్కువ రిస్క్ తో నాలుగు రూపాయలు వెనుకేసుకోవాలనుకునే వారికి మేకల పెంపకం మంచి గ్రామీణ సంపాదన అవకాశంగా చెప్పుకోవచ్చు. రోజురోజూ మార్కెట్లో మాంసానికి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. పైగా మహిళలు తక్కువ శ్రమతో వీటిని ఇంటివద్దే పెంచవచ్చు. పైగా ఇది పర్యావరణానికి హాని చేయని వ్యాపార ఆలోచన. ఫ్యాక్టరీలు మాదిరిగా కలుషితాలు, విష వ్యర్థాలు సైతం ఇందులో ఉండవు.

చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు మేకల పెంపకం గొప్ప లాభాలను తెస్తుంది. మేకల పెంపకం ద్వారా నెలకు 2 లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. పశువులు, గేదెల పెంపకానికి కూడా చాలా నీరు అవసరం. కానీ మేకల పెంపకంలో ఆ సమస్య ఉండదు. పైగా ఇది ప్రజల ఆహార అవసరాలను తీర్చే మంచి వ్యాపారం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కూడా. దేశంలోని హర్యాణా, తమిళనాడు ప్రభుత్వాలు దీనికి సబ్సిడీలు, రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
మేకల పెంపకంలో సగటు నెలవారీ లాభాలను పరిశీలిద్దాం. మీకు 18 ఆడ మేకలు ఉంటే నెలకు రూ.2,16,000 సంపాదించవచ్చు. అదే 18 మగ మేకలు ఉన్నట్లయితే.. నెలకు 1,98,000 సంపాదించొచ్చు. పొడి వాతావరణం, తక్కువ నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లోని ప్రజలు మేకల పెంపకంపై దృష్టి సారించవచ్చు. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు వీటి పెంపకానికి అనుకూలంగా ఉంటాయి కూడా. పైగా ప్రస్తుతం ఈ వ్యాపారంలో ఉన్న రైతులను కలిసి పెంపకంలో మెళకువలను అడిగి తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications