మోడీ చురకల తరువాతా..మారని ధరలు: పెట్రోల్, డీజిల్ రేట్లివీ: రిలీఫ్ కంటిన్యూస్

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా మూడో రోజు కూడా మార్పు చోటు చేసుకోలేదు. చమురు కంపెనీలు వాటి రేట్లను పెంచలేదు. బుధవారం నాటి రేట్లే మూడో రోజు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ- కొద్దిరోజులుగా వరుసగా భారీగా పెరుగుతూ వస్తోన్న ధరల వల్ల పెట్రోల్ రేటు అనేక నగరాల్లో 110 నుంచి 120 రూపాయల మధ్య ఉంటోంది. డీజిల్ పరిస్థితీ దాదాపు ఇంతే. 100 నుంచి 110 రూపాయల మేర పలుకుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరలను చమురుసంస్థలు కొద్దిరోజులుగా పెంచుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. కిందటి నెలలో ఈ పెరుగుదల ఆరంభమైంది. లీటర్‌పై సగటున ప్రతీరోజూ 80 పైసల మేర భారం పడుతూ వచ్చింది. ఫలితంగా లీటర్‌పై 10 రూపాయల మేర అదనపు భారాన్ని వాహనదారులు భరించే పరిస్థితి ఏర్పడింది. ఈ పెంపుదల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తన పంథానూ మార్చుకోలేదు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వ్యవహారం కాస్త రాజకీయ రంగును సైతం పులుముకొన్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌ను తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీ, తెలంగాణ సహా పలు బీజేపీయేతర పార్టీలు ఈ రాష్ట్రాల జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర వంటి ఒకట్రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రధానిపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టాయి.

Petrol and diesel prices continue to remain constant on April 30, 2022, check the price in your city here

17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ దరలు నిలకడగా ఉన్నందున ఈ రెండు రోజులూ ఇంధన రేట్లను సవరించలేదు చమురు కంపెనీలు. బుధవారం నాటి రేట్లే ఇవ్వాళ కూడా కొనసాగుతున్నాయి. దీని ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.41 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ120.51 పైసలు, డీజిల్ రూ.104.77 పైసలుగా నమోదైంది.

కోల్‌కతలో పెట్రోల్ రూ.115.12 పైసలు, డీజిల్ రూ.99.83 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.110.85 పైసలు, డీజిల్ 100.94 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.111.09 పైసలు, డీజిల్ రూ.94.79 పైసలుగా ఉంటోంది. గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.105.86 పైసలు, డీజిల్ 97.10 పైసలు, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.117.19 పైసలు, డీజిల్ 103.95 పైసలుగా నమోదైంది. అదే సమయంలో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ రేట్లను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన విషయం తెలిసిందే. గృహావసర వినియోగదారులను సైతం వదల్లేదు. కమర్షియల్ సిలిండర్లపైనా భారం మోపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+