Business Ideas: రూ.10,000తో ప్రారంభించే బిజినెస్.. రోజూ డిమాండ్..
Business Ideas: తక్కువ ఆదాయం వచ్చిన సొంత వ్యాపారం కలిగి ఉండాలని నేటి కాలంలో చాలా మంది భావిస్తున్నారు. అయితే తక్కువ ఖర్చుతో ప్రారంభించే బిజినెస్ ఐడియాల గురించి అన్వేషిస్తున్న వారికి ఇది సరైనది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నట్లు స్టేషనరీ షాపు వ్యాపారం గురించి. దీనిని కళాశాలలు లేదా పాఠశాలకు సమీపంలో ఏర్పాటు చేయవచ్చు. దీనిని కనీసం రూ.10,000 ప్రారంభ పెట్టుబడితో సరైన లొకేషన్‌లో ప్రారంభించవచ్చు. అయితే పూర్తి స్థాయిలో అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలంటే రూ.50,000 నుంచి రూ.60,000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది.

దుకాణంలో పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్, ఇతర స్టేషనరీ వస్తువులను విక్రయించవచ్చు. దీనికి తోడు మీరు జిరాక్స్ మిషిన్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా మరింత ఎక్కువగా ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే గ్రీటింగ్ కార్డులు, రాఖీలు, డెకరేషన్ ఐటమ్స్ వంటి ఫ్యాన్సీ వస్తువులను సైతం ఇక్కడ విక్రయించుకోవచ్చు. దీనికి డిమాండ్ ఏడాది పొడుగునా సేల్స్, డిమాండ్ ఉంటూనే ఉంటుంది.
మీరు వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముందుగా షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం క్రింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయిస్తే 30 నుంచి 40 శాతం వరకు మార్జిన్ పొందవచ్చు. మంచి విక్రయాలు చేస్తున్నట్లయితే ప్రతినెల రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే సమీపంలోని స్కూళ్లు, కాలేజీలకు వీటిని హోల్ సేల్ ధరలకు ఎక్కువ సంఖ్యలో విక్రయించవచ్చు. తద్వారా తక్కువ లాభాలతో ఎక్కువ ఆదాయాన్ని పొందటానికి వెసులుబాటు ఉంటుంది.


Click it and Unblock the Notifications