Business Ideas: షాపు-మెషిన్లు అవసరం లేదు.. రూ.25 వేల పెట్టుబడితో లక్ష సంపాదన..!
Business Ideas: మారుతున్న ఆధునిక యుగంలో సృజనాత్మకతతో పనిచేసేవారు ఎక్కువ సంపాదన పొందుతున్నారు. అసంఘటిత రంగాల్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వీటిలో తక్కువ పెట్టుబడితోనే నెలకు నాలుగింతలు ఆదాయం పొందేందుకు వ్యాపార అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటి ద్వారా భారీగా డబ్బు సంపాదించుకోవచ్చు. దేశంలో చాలా మంది సొంత వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటున్న తరుణంలో యువతకు ఇది మంది వ్యాపార ఆలోచనని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సైన్ బోర్డు తయారీ వ్యాపారం గురించి. ప్రస్తుత కాలంలో ఆకర్షనీయంగా దుకాణాలు, షోరూమ్ లు కనిపించేందుకు వీటిని చాలా మంది ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజూ నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల కొత్త దుకాణాలు, ఆఫీసులు, షోరూమ్ లు తెరుచుకుంటూనే ఉన్నాయి. వీటికి అందమైన సైన్ బోర్డులు చాలా ముఖ్యం. ఈ వ్యాపారంలో మంచి ఆదాయాన్ని తక్కువ పెట్టుబడితో, ఎలాంటి భారీ యంత్రాలు లేకుండానే ప్రారంభించవచ్చు.

ముందుగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ముందు నగరాల్లో కొంత పరిశోధన చేయటం ముఖ్యం. ఎలాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడుతున్నారో గమనించాలి. దీనికి తోడు సైన్ బోర్డుల తయారీలో ఉన్న వారిని కలిసి మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. ధరల శ్రేణి ఎలా ఉంది, ఎంత ఛార్జ్ చేస్తున్నారు వంటి వివరాలు కనుక్కోండి. దీనిని తర్వత అందరికీ చేరువ చేసేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్ ప్రారంభించవచ్చు. అందులో మీరు రకరకాల సైన్ బోర్డుల ఫోటోలను ఉంచవచ్చు.
ఇలా ఆరంభంలో కేవలం రూ.25,000 కనీస పెట్టుబడి అవసరం అవుతుంది. ఆ తర్వాత మీరు నగరంలోని దుకాణాలు, షోరూమ్ లకు స్వయంగా వెళ్లి మీరు అందించే సేవల గురించి వారికి వివరంగా తెలియజేయాలి. సైన్ బోర్డు ఏర్పాటు షాపును ఆకర్షనీయంగా మారుస్తుందని వారికి వివరించాలి. మీ విజిటింగ్ కార్డులను వారికి అందించవచ్చు. ఒక వేళ వారికి అవసరం లేకున్నా.. వారి స్నేహితులు, ఇతర వ్యాపారులకు అవసరమైతే మిమ్మల్ని సంప్రదించమని రిఫర్ చేస్తారు.

మెుదట్లో కేవలం రోజుకు 5 ఆర్డర్లు పొందగలిగినా మంచి ఆదాయమే వస్తుంది. వ్యాపారం పెరిగిన తర్వాత అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేసుకుని భారీగా వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. ఇలా మంచి పేరు సంపాదించుకోవటం వల్ల ఎక్కువ ఆర్డర్లు పొందటం ద్వారా నెలకు రూ. లక్ష వరకు సంపాదనను పొందవచ్చు.


Click it and Unblock the Notifications