Business Ideas: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన ఆహారాలు చాలానే ఉన్నాయి. మార్కెట్లో ఇలాంటి వ్యాపారాలను నిర్వహిస్తూ తక్కువ పెట్టుబడితో చాలా మంది మంచి ఆదాయాన్ని ఇప్పటికే పొందుతున్నారు. దీనిని రిటైల్‌గా నిర్వహించటంతో పాటు హోల్‌సేల్‌గా కూడా చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడి.. పనివారితో చేసుకునే ఒక సూపర్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వయస్సు ఎంత పెరిగినా అందరూ ఇష్టపడేవి చిప్స్. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల చిప్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. పొటాటో చిప్స్, బనానా చిప్స్, క్యారెట్ చిప్స్, మసాలా చిప్స్, కాకరకాయ చిప్స్ ఇలా అనేక రకాలను చిరుతిళ్లుగానే కాక భోజనంలోనూ తింటుంటారు. వీటిని తయారు చేసేందుకు కావల్సిన ముడి పదార్థాలు సైతం తక్కువ సంఖ్యలో అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి పెట్టుబడి కూడా ఎక్కువగా అవసరం ఉండదు. పైగా వీటిని హోల్ సేల్ మార్కెట్ల నుంచి ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకుంటే నాణ్యమైనవి దొరుకుతాయి.

దీనికోసం ఒక షాపును అద్దెకు తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లేదా ఇంటి వద్దే తయారు చేసి మార్కెట్లోని హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారులు, బేకరీలు, చిన్న సూపర్ మార్కెట్లు, క్యాంటీన్లకు సప్లై చేసుకోవచ్చు. సేల్స్ పెరిగితే దానికి అనుగుణంగా చిప్స్ తయారీని యాంత్రీకరించుకుని కట్టింగ్, ప్యాకింగ్ మెషిన్లను వినియోగించవచ్చు. దీనిలో ప్రధానంగా తయారీలో క్వాలిటీ ముడి సరుకులు, నూనెను ఉపయోగించి రుచికరంగా తయారు చేస్తే ఎక్కువ మంది రెగ్యులర్ కస్టమర్లుగా మారతారు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు అవసరం ఉంటుంది. ఒక చిన్న కుటుంబంలోని వ్యక్తులు కలిసికట్టుగా పనిచేసుకుంటూ దీనిపై ఉపాధి పొందవచ్చు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర లోన్ పథకం ద్వారా కూడా నిధులను సమకూర్చుకోవచ్చు. అయితే మంచి రద్దీ ఉండే మార్కెట్లు, కమర్షియల్ ఏరియాలను ఎంపిక చేసుకుని వ్యాపారాన్ని ఏర్పాటు చేయటం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. రోజంతా కష్టపడి ఇంటికి వెళ్లేటప్పుడు అలా పిల్లలకు రుచికరమైన స్నాక్స్ తీసుకెళ్లాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్ చేసుకుని మంచి క్వాలిటీ అందిస్తే తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభిస్తుంది.


Click it and Unblock the Notifications