Business Ideas: చిన్నదైనా సొంత వ్యాపారం ఉండాలని చాలా మంది ఈ కాలంలో భావిస్తున్నారు. అయితే వీటితో కొంత రిస్క్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న బిజినెస్ మాత్రం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. పైగా దీనికి గ్రామీణ స్థాయి నుంచి పెద్ద పట్టణాల వరకు ప్రతిచోటా భారీగా వినియోగదారులు ఉండటం కలిసొచ్చే పెద్ద అంశం.
ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మినరల్ వాటర్ వ్యాపారం గురించి. తాగునీటికి ప్రతిరోజూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. నగరీకరణ పెరిగిన తర్వాత ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చింది. నీటి కాలుష్యం పెరగటంతో చాలా మంది శుద్ధి చేసిన మంచినీటిని తాగేందుకు మారిపోయారు. చిన్న గ్రామాల్లో సైతం ప్రజలు 20 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను కొనుక్కుంటున్నారు.

ఈ వ్యాపారాన్ని ప్రాథమికంగా కావాల్సింది ఒక ఆర్వో ఫ్యూరిఫయర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం. మన ప్రాంతంలో ఉన్న డిమాండ్ కి అనుగుణంగా ప్లాంట్ సైజ్ కెపాసిటీని నిర్ణయించుకోవచ్చు. దీనిని ఏర్పాటు చేయటానికి ఒక చిన్న గది ఉంటే సరిపోతుంది. మంచినీటి కోసం ఒక బోరు, మినరల్ వాటర్ క్యాన్స్ అవసరం ఉంటుంది. దీనికి తోడు స్థానిక అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది.

ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుగా రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. భారీగా సేల్స్ చేస్తున్నట్లయితే.. రోజూ రూ.5000 నుంచి రూ.10000 వరకు ఆదాయం లభిస్తుంది. అంటే నెలకు దాదాపు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదించొచ్చు. అన్ని రకాల ఖర్చులు 50 శాతంగా తీసుకుంటే కనీసం లాభం రూ.లక్ష పొందవచ్చు. అంటే మీరు పెట్టిన మెుత్తం పెట్టుబడిని మూడు నుంచి నాలుగు నెలల కాలంలో తిరిగి పొందవచ్చు. వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపారం పొందటం చాలా సులువు. ఆఫీసులు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు, హోటళ్లకు సప్లై చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications