Business Ideas: సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి ఉండాల్సింది సరైన ఆలోచనే. కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. సరైన అవకాశాలు, అవకాశాల తగిన వ్యాపార ఆలోచనలు ఉండాలి. అలా ఒక్కసారి పెట్టుబడిపెడితే జీవితాతం రాబడిని అందించే ఆలోచన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజుల్లో ప్రజలు ఫంక్షన్లు గ్రాండ్ గా చేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కల్చర్ వల్ల పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు, కిట్టీ పార్టీలు, ఫ్రెండ్స్ మీట్స్ వంటివి ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇందుకోసం ఈవెంట్ మేనేజర్స్ కు డిమాండ్ భారీగా పెరిగింది. పెద్ద పట్టణాల్లోనే కాక చిన్న టౌన్స్, గ్రామాలకు కూడా ఈ కల్చర్ పాకింది.

ఈ వ్యాపార ఆలోచనను నేటి తరం యువత అందిపుచ్చుకోవచ్చు. దీనిని చిన్న స్థాయిలో లేదా పెద్ద స్థాయిలో కూడా నిర్వహించటం ప్రారంభించవచ్చు. దీని కోసం ముందుగా కొంత పెట్టుబడి పెట్టి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ఒక్కరే లేదా మిత్రులతో కలిగి జాయింట్ గా ప్రారంభించవచ్చు. కేవలం ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఆన్ లైన్ వెబ్ సైట్ ప్రారంభించటం వల్ల ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాపారాన్ని నిర్వహించవచ్చు.
దీనికోసం డెకరేషన్, ఫుడ్, లైటింగ్, సౌండ్ సిష్టమ్, టెంట్ హౌస్ సామాగ్రి, ఇతర ఎంటర్ టైన్మెంట్ సామాగ్రి అవసరం ఉంటుంది. కస్టమర్లు కోరుకునే వసతులకు అనుగుణంగా ఒక్కో ఈవెంట్ కు లక్షల్లో ఛార్జ్ వసూలు చేస్తుంటారు. ఖర్చులు పోయినప్పటికీ ప్రతి ఈవెంట్ కు వేల నుంచి లక్షల రూపాయలు లాభంగా మిగులుతాయి. పైగా దీనిని నిర్వహించటానికి ఎలాంటి అదనపు రోజువారీ ఖర్చులు ఉండవు. ఇంటి దగ్గర ఒక గోదాము కలిగి ఉంటే సరిపోతుంది.

వ్యాపారాన్ని ప్రారంభించటానికి ముందుగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రాథమిక పెట్టుబడి అవసరం ఉంటుంది. బ్యాంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు వంటి వాటితో పరిచయాలు ఉన్నట్లయితే ఎక్కువ ఆర్డర్లు పొందవచ్చు. మంచి ఈవెంట్లను పొందటం వల్ల ఏడాదికి రూ.15 నుంచి రూ.20 లక్షలు లాభం పొందవచ్చని ఈ రంగంలోని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications