Business Ideas: గ్రామంలోనే ప్రారంభించుకునే వ్యాపారం.. తక్కువ పెట్టుబడి ఎక్కువ డిమాండ్..
Business Ideas: ప్రస్తుతం వినియోగదారుల అవసరాలను సకాలంలో గుర్తించటమే వ్యాపార అవకాశాలుగా మారుతున్నాయి. కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. మంచి ఆరోగ్యపు అలవాట్లను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పురాతన కాలం నాటి అలవాట్ల వైపు తిరిగి మళ్లుతున్నారు. ఇవి చాలా మందికి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారాలకు అవకాశాలను అందిస్తున్నాయి.
తక్కువ ప్రదేశంలో చిన్న గ్రామంలో కూడా ప్రారంభించగలిగే వ్యాపారమే మినీ ఆయిల్ మిల్. వంటల్లో వినియోగించే ఎడిబుల్ ఆయిల్ కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. చిన్న ఆయిల్ మిల్ లేదా గానుగను ఏర్పాటు చేయటం ద్వారా కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్స్ విక్రయాన్ని ప్రారంభించవచ్చు. ఈ పద్ధతిలో తయారు చేసిన ఆవనూనె, శనగనూనె, సోయాబీన్ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనెలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పైగా ఇలాంటి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించటానికి చాలా ఖరీదైన పెద్దపెద్ద యంత్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషిన్ అవసరం. దీనిని చిన్నపాటి గదిలో అమర్చుకోవచ్చు. నూనెను తయారు చేసేందుకు ముందుగా ఎంపిక చేసిన నూనె గింజలను తెప్పించుకోవాల్సి ఉంటుంది. మెషిన్ ఖర్చు రూ.2 లక్షల వరకు ఉంటుంది. దీనికి తోడు మిగిలిన వస్తువులు, ప్యాకేజింగ్ మెటీరియల్ కొనుగోలుకు మరో రూ.2 లక్షల వరకు అవసరం అవుతుంది. అంటే మెుత్తంగా రూ.4 లక్షల్లో మినీ ఆయిల్ మిల్ వ్యాపారాన్ని సొంత ఊళ్లోనే ప్రారంభించుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా వేరుశనగ నూనెతో పాటు సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగిస్తుంటారు. గింజల నుంచి నూనెను తీసిన తర్వాత వచ్చే పిప్పిని కూడా పశువుల దాణాగా వినియోగిస్తారు. కాబట్టి మెుత్తం మీద దాదాపు 20-25 శాతం మార్జిన్ మిగిలే అవకాశం ఉంటుంది. మంచి సేల్స్ టర్నోవర్ నిర్వహించగలిగితే యజమానులు ఏర్పాటుకు చేసిన ఖర్చులను దాదాపు రెండేళ్లలో వెనక్కి పొందవచ్చు. పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహించటానికి ఎక్కువ మంది పనివారు కూడా అవసరం ఉండదు.


Click it and Unblock the Notifications