Business Ideas: ఇండియాలో భారీ డిమాండ్ ఉన్న బిజినెస్.. కష్టపడితే లాభం ఎక్కువే..!
Business Ideas: డబ్బు సంపాదించటానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్నింటిలో కష్టం తక్కువగా ఉంటే మరికొన్నింటిలో మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇష్టపడి చేసేవారికి మాత్రం లాభాలను త్వరగా చూసేందుకు అవకాశాలు ఎక్కువ.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది పాడి పరిశ్రమ గురించి. ఇందులో కష్టంతో పాటు మంచి ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి అవసరమైన స్థాయిలో లేదు. ఇందుకోసం పాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యోచనలో కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇప్పుడు పాడి వ్యాపారంలోకి వెళ్లటం ఉత్తమమైన నిర్ణయం. దీనిని చిన్న స్థాయిలో ఇంటి పెరటిలోనే ప్రారంభించుకోవచ్చు.

డబ్బు కొరత ఉన్నవారు గేదెలను లేదా ఆవులను ఒక్కదానిని కొనుగోలు చేయటం ద్వారా కూడా ప్రారంభించవచ్చు. ఇందుకోసం భారీ పెట్టుబడి అవసరం ఉండదు. మెుదట్లో పాలను గ్రామంలోని లేదా నగరంలోని చుట్టుపక్కల వారికి విక్రయించవచ్చు. నాణ్యమైన కల్తీ లేని పాలకు భారీగా డిమాండ్ ఉన్నందున అమ్మకాల గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
దీనికోసం ప్రారంభంలో రూ.50,000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. అలాగే భారీ స్థాయిలో పాల ఉత్పత్తి చేద్దామనుకునే వారికి వారి ఆలోచనకు అనుగుణంగా మూలధన అవసరాలు ఉంటాయి. యాంత్రీకరణతో ఎక్కువ పశువులను పెంచాలనుకుంటే మాత్రం దానికి అధికంగా ప్రథమిక పెట్టుబడి అవసరం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యావంతులు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టి మంచి లాభాలను గడిస్తున్నారు.
ఈ వ్యాపారన్ని ప్రారంభించినప్పటి నుంచే లాభాలను స్వీకరించటం ప్రారంభించవచ్చు. అయితే ఇందులో ఎక్కువ దిగుబడిని పొందటానికి పశువుల మేత, సంరక్షణ, వాటి ఆరోగ్యం గురించి అనేక మెళకువలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే లాభాల బాట పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఒక్క గేదెతో పాల ఉత్పత్తిని ప్రారంభించినట్లయితే నెలకు రూ.8000 వరకు లాభాన్ని పెందవచ్చు. అలా పశువుల సంఖ్యను పెంచుకుంటూ పోతే నెలకు సులువుగా రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చు. పైగా పాడి పరిశ్రమ ప్రోత్సాహకానికి ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటిని రైతులు వినియోగించుకుని ముందుకు సాగటం ఉత్తమం.


Click it and Unblock the Notifications