చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేవాటిలో ఎల్లప్పుడూ బేకరీ ఉత్పత్తులు ఉంటాయి. ప్రస్తుత కాలంలో కూల్ కేక్స్, డిజైనరీ కేక్స్ ప్రాచుర్యం పొందటంతో వాటికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందుకోసం తగిన నైపుణ్యం ఉన్నట్లయితే ఇంటి వద్దే తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ఎవరైనా ప్రారంభించవచ్చు.

కూల్ కేక్స్ తయారీ వ్యాపారానికి అవసరమైందల్లా చిన్న గది మాత్రమే. అక్కడ చిన్న గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ ఓవెన్ ఏర్పాటు చేసుకుని తయారీని ప్రారంభించవచ్చు. ఇందుకోసం క్రీమ్ బీటర్, కేక్ మిక్సర్ లాంటి చిన్న మెషిన్స్, ఫ్రీజర్ ఉంటే సరిపోతుంది. వీటికి తోడు కొన్ని కేక్ మౌల్డ్స్, కలర్స్, డెకరేషన్ ఇంగ్రీడింట్స్ తో పాటు కేకు తయారీ కోసం సామాన్లు అవసరం ఉంటుంది. ఈ మెుత్తం సెటప్ కోసం రూ.1.50 లక్షల వరకు అవసరం ఉంటుంది. అలాగే రూ.50 వరకు వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉంటుంది. వీటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుగోలు చేస్తే రూ.లక్షలోపే పొందవచ్చు. హోమ్ మేడ్ షాప్ ప్రారంభించి ఇంటి వద్దే ఆర్డర్లు తీసుకోవటం చేయవచ్చు.

వ్యాపారాన్ని మరింత మందికి చేరువ చేసి లాభాలను పెంచుకోవాలంటే ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకోవచ్చు లేదా జొమాటో, స్విగ్గీ వంటి అగ్రిగేటర్లతో ఒప్పందం కుదుర్చుకుని విక్రయాలు చేపట్టవచ్చు. చిన్నగా ప్రారంభించిన తర్వాత ప్రాచుర్యం పొందితే మీరు నివసిస్తున్న నగరంలోనే రిటైల్ షాప్ కూడా ఏర్పాటు చేయవచ్చు. నివసిస్తున్న నగరంలో వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఫ్రీ డెలివరీ సౌకర్యాన్ని కూడా అందిస్తే బిజినెస్ సులువుగా క్లిక్ అవుతుంది. మంచి ఆర్డర్లు సంపాదించుకోవటం ద్వారా నెలకు రూ.30 వేల నుంచి రూ.60 వరకు సంపాదించొచ్చు. తర్వాత కుక్కీస్, కప్ కేక్స్, బిస్కెట్స్, రస్క్, మిల్లెట్ బిస్కెట్స్, బ్రెడ్ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించటం ద్వారా వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications