Business Ideas: మార్కెట్లో ఫుల్ డిమాండ్.. కరోనా తర్వాత కాసులు కురిపిస్తున్న వ్యాపారం..
Business Ideas: గత రెండుమూడేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మన పూర్వీకులు వినియోగించిన ఉత్పత్తుల వైపు చాలా మంది తిరిగి వస్తున్నారు. ఇది కొత్త వ్యాపార అవకాశాలను ప్రజలకు అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కోల్డ్ ప్రెస్ వంట నూనెల తయారీ గురించి. కరోనా తర్వాత కెమికల్స్ లేని స్వచ్ఛమైన ఆహారాల ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో వంట నూనెల విషయంలోనూ చాలా మంది ఔత్సాహికులు నూనె గానుగలను ఏర్పాటు చేసి ఉపాధిని పొందుతున్నారు. వీటిని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవచ్చు.

కోల్డ్ ప్రెస్డ్ నూనెల్లో ఆరోగ్యానికి మేలు చేసే యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇలా గానుగను ఏర్పాటు చేసి ఆవనూనె, నువ్వులనూనె, వేరుశనగనూనె, సన్ ఫ్లవర్ నూనె, కొబ్బరినూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఈ పరిశ్రమను ఏర్పాటు చేసినవారు దాదాపు 35 శాతం నుంచి 40 శాతం ఆదాయాన్ని పొందవచ్చు. పైగా మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉన్నందువల్ల త్వరగా లాభాల బాట పట్టవచ్చు.
ఈ పరిశ్రమను ఏర్పాటు చేయటానికి ముందుగా రెండు గానుగలను కొనాల్సి ఉంటుంది. ఇందుకోసం కనీసం ముందస్తుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. మంది క్వాలిటీ నూనె గింజలను ఎంపిక చేసి తెచ్చుకోవటం వల్ల నూనె దిగుబడి ఎక్కువగా వస్తుంది. దీని వల్ల వినియోగదారుల నుంచి మంచి పేరుతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుంది.
సొంతంగా వంట నూనెల తయారీని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. దీనికోసం ఒక గది ఉండే సరిపోతుంది. దీని ద్వారా నెలకు రూ.లక్ష వరకు సంపాధించుకోవచ్చు. దీనిని నడపటానికి ఒకరు లేదా ఇద్దరు పనివారు అవసరం ఉంటుంది. దీనికి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలు, ప్యాకింగ్ మెటీరియల్ వంటి ప్రాథమిక అవసరాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications