Business Ideas: ఉన్న చోటే సంపాదన.. వేసవిలో సూపర్ డిమాండ్.. నెలకు లక్ష ఆదాయం బాస్..!
Business Ideas: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. అసలే కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు. ఏదైనా పనిచేసి నాలుగు రూపాయలు సంపాదిద్దాం అని చాలా మంది యువత ఆలోచిస్తుంటారు. మరికొందరు చాలీచాలని ఆదాయంతో ఇబ్బందులతో సతమతమౌతుంటారు. అలాంటి వారికి ఇదొక సూపర్ బిజినెస్ ఐడియా.
వేసవిలో ఎండ తాపాన్ని తీర్చుకునేందుకు మనలో చాలా మంది కొబ్బరి నీళ్లను దివ్య ఔషధంగా భావిస్తుంటాం. ఏదైనా పనిమీద ఇంటి నుంచి రోడ్డు మీదకు రాగానే కొద్ది సేపటికి భానుడి భగభగలతో నీరసపడిపోతుంటాం. అప్పుడే చల్లగా కొబ్బరి నీళ్లు తాగుదాం అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇందులోని ప్రకృతి సిద్ధమైన లవణాలు, ఖనిజాలు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి కాబట్టి.

ఇది యువతకు మంది ఉపాధి అవకాశాలను అందిస్తుంది. మంచి బిజినెస్ పాయింట్ లేదా రోడ్డు పక్కన చెట్టు కింద కొబ్బరి బోండాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనికోసం ఎక్కువ నీరుండే మంచి కొబ్బరి బోండాలను గోదావరి జిల్లాలు లేదా బెంగళూరు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో వీటిని కొనుగోలు చేయటం వల్ల ధర తక్కువగా పడుతుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ముందుగా రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు అవసరం ఉంటుంది. అలా ఒక్కో కాయపై రూ.10 నుంచి రూ.15 లాభం వేసుకుని విక్రయించవచ్చు. ఇలా చేయటం వల్ల సులువుగా రోజురు రూ.3,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
అంటే నెలకు దాదాపు రూ. లక్ష సంపాదించవచ్చు. సాధారణ సమయాల్లోనూ వ్యాపారం మంచిగానే సాగుతుంది. అయితే వేసవి రెండు మూడు నెలలు మాత్రం మంచి గిరాకీ ఉంటుంది. ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూనే మీరు కూడా సూపర్ లాభాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications