Business Ideas: 10 వేలతో బెస్ట్ బిజినెస్ ఐడియా.. శ్రద్ధతో చేస్తే లక్ష ఆదాయం పక్కా..
Business Ideas: ఏదైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవటం కొంత కష్టంతో కూడుకున్నప్పటికీ.. సరైన ఆలోచనతో ముందుకు సాగటం మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే ప్రారంభించే క్యాటరింగ్ బిజినెస్ గురించి. ప్రస్తుతం పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రతిచోటా ఫంక్షన్లకు రుచికరమైన భోజనాలను క్యాటరింగ్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఈ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవటంతో లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు.

రుచికరమైన, రకరకాల ఆహారాలను వండి వడ్డించటం అనే నైపుణ్యం ఇందుకు చాలా అవసరం. శుభకార్యాల సీజన్లో ఎక్కువగా ఆర్డర్లు ఉంటాయి కాబట్టి నెలకు కనీసం రూ.లక్షకు పైగా సంపాదించవచ్చు. మిగిలిన సమయాల్లో తక్కువగా ఉన్నప్పటికీ రూ.30 నుంచి రూ.45 వేల వరకు చిన్న చిన్న ఫంక్షన్లకు క్యాటరింగ్ చేయటం ద్వారా సంపాదించొచ్చు. మీరు నివసిస్తున్న ప్రాంతం నుంచే దీనిని ప్రారంభించవచ్చు.. అయితే దీనికోసం వంటసామానం, పనివారు, శుభ్రమైన వంట ప్రదేశం అవసరం ఉంటుంది.
దీనికోసం ముందుగా మీరు చేయాల్సింది మీ సమీప ప్రాంతంలో మార్కెట్ ఎలా ఉంది. క్యాటరింగ్ ధరలు ఎలా ఉన్నాయి వంటి విషయాలు తెలుసుకోవటం ముఖ్యం. అలాగే ఈ రంగంలో ఉన్న ఎవరైనా తెలిసి ఉంటే వారితో చర్చించి మెలకువలు తెలుసుకోవటం ముఖ్యం. అలాగే మీ వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి. అప్పుడే కస్టమర్లు మిమ్మల్ని సులువుగా చేరుకోగలరు. ఆన్ లైన్ సాధనాలను సైతం ఇందుకోసం మీరు వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications