Business Ideas: ప్రతిరోజూ డిమాండ్ ఉండే వస్తువు.. ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే డబ్బులే..!
Business Ideas: జీవితాంతం ఒకరి కింద పనిచేస్తూ బతకటం మానేయాలని ఈ రోజుల్లో చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో తమకు తోచిన వ్యాపారాలను ప్రారంభించటం ద్వారా తమకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదే క్రమంలో రిస్క్ తక్కువ ఉండే వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి డబ్బు సంపాదించాలని భావించే వారు సహజ వస్తువులతో తయారైన చీపురులను ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది ఎప్పటికీ మాంద్యం లేని వ్యాపారం.. ఏడాది పొడవునా గృహ వినిగదారుల నుంచి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. వీటిని సహజంగా లభించే గడ్డి, కొబ్బరి, తాటాకులు, మెుక్కజొన్న పొట్టు వంటి ఉత్పత్తులతో చీపుర్లను తయారు చేయవచ్చు.

రోజూ ఇళ్లు, ఆఫీసులు, పరిసరాలను శుభ్రం చేసేందుకు విరివిగా చీపుర్లను ప్రజలు ఉపయోగిస్తుంటారు. అందువల్ల చీపుర్లను తయారు చేసే వ్యాపారం ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది. దీనిని గ్రామంలో లేదా పట్టణంలో వినియోగించవచ్చు. ఇందుకోసం కనీసం 50 చదరపు మీటర్ల స్థలం అవసరం ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించటానికి.. చీపురు హ్యాండిల్ క్యాప్, ప్లాస్టిక్ టేప్, స్ట్రాపింగ్ వైర్ వంటి ముడి పదార్థాలు అవసరం ఉంటుంది. దీనికి తోడు ప్యాకింగ్ మెటీరియల్ అవసరం ఉంటుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఒక వ్యక్తి కనీసం రూ.20 వేలు ప్రాథమిక పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. చీపుర్లను తయారు చేసి హోల్ సేల్, రిటైల్ దుకాణాలతో పాటు డిపార్ట్మెంటల్ స్టోర్లకు సప్లై చేయటం ద్వారా నెలకు రూ.50 వేల వరకు ఆదాయం పొందవచ్చు. టర్నోవర్ పెంచుకుంటూ పోతే లాభాలు సైతం గణనీయంగా పెరుగుతాయి.


Click it and Unblock the Notifications