Business Ideas: సీజన్లతో సంబంధం లేని వ్యాపారం.. పెట్టుబడి తక్కువ డిమాండ్ ఎక్కువ..!
Business Ideas: సాధారణంగా వ్యాపారం అనగానే ఎక్కువ మంది ఆలోచించేంది రోజూ ఆదాయం కావాలని. ఇందుకోసం సీజన్లతో సంబంధం లేకుండా ఉండే ఆహార రంగాన్ని ఎక్కువ మంది ఎంచుకుంటుంటారు. మారుతున్న ప్రజల ఆలోచనలు, ఆహారపు అలవాట్లు కూడా కొన్ని వ్యాపారాలకు అండగా నిలుస్తున్నాయి.
బిజీబిజీగా ఉదయాన్నే పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా రుచికరమైన స్నాక్స్ తినాలని చాలా మంది అనుకుంటుంటారు. కొంతమంది బిజీ పనిలో పడిపోయి పిల్లల కోసం తినేందుకు బయటి నుంచి చిరుతిళ్లను కొనుక్కెళుతుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా కొనుగోలు చేసేది చిప్స్. అందువల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే అరటికాయ చిప్స్ తయారు చేసి విక్రయించటం మంచి ఆదాయాన్ని ఇస్తుంది.

ప్రస్తుతం సమయంలో చాలా మంది తమ సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎక్కువగా మెుగ్గు చూపుతున్న తరుణంలో చిప్స్ తయారీ వ్యాపారం కాసులు కురిపిస్తుంది. చిన్న మెుత్తంలో వ్యాపారం చేసే వారికైనా లేక కొంచెం పెద్ద మెుత్తంలో చేసే వారికైనా ఎక్కువ యంత్రాలతో అవసరం ఉండదు. అవును పైగా చిప్స్ ఫ్రై చేసేందుకు పొట్టు, కట్టెలతో తయారు చేసిన పొయ్యి వినియోగించటం చాలా డబ్బును ఆదా చేస్తుంది.
ప్రాధమికంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించే వారు ఫ్రై చేయటానికి ఒక బాండీ, చిప్స్ కట్టింగ్ మెషిన్, కొన్ని ఇతర పరికరాలతో పాటు ప్యాకింగ్ మెటీరియ్స్ అవసరం ఉంటుంది. అసలు రుచిని పెంచే ముఖ్యమైనవి పచ్చి అరటికాయలు, నూనె, ఉప్పు, మసాలా పొడి, కారం పైన వాటికి అదనంగా అవసరం ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పరంగా చూసుకుంటే కేవలం రూ.50,000 వేలు ప్రారంభ పెట్టుబడి దీనికి సరిపోతుంది.

చిప్స్ విక్రయ వ్యాపారానికి లాభాల మార్చిన్ సైతం 20 నుంచి 30 శాతం ఉంటుంది. కాబట్టి పనివారు లేకుండా ఇంట్లోని కుటుంబ సభ్యుల సహకారంతో ఖర్చులను తగ్గించుకోవచ్చు. భారీ స్థాయిలో తయారు చేసి విక్రయిస్తే నెలకు రూ. లక్షకు పైగానే ఆదాయం పొందవచ్చు.


Click it and Unblock the Notifications