Business Ideas: ఒకప్పుడు వ్యవసాయ రంగం దండగ అన్న వారు ఇప్పుడు అనేక మంది యువరైతులు చేస్తున్న అద్బుతాలు చూసు ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను ఎంచుకుని లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది వెదురు సాగు గురించి. అవును అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల్లోని ప్రజలు వీటి విక్రయం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో వీటికి మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా ఇండియాతో పాటు చైనాతో పాటు ఆసియాలోని అనేక మార్కెట్లలో వెదురు వినియోగం అధికంగా ఉంది. అమెరికా, ఆఫ్రికాల కంటే ఆసియా ఖండంలోనే సాగు ఎక్కువ కావటం విశేషం.

ప్రధానంగా వెదురు సాగులో భారత్ రెండవ స్థానంలో కొనసాగుతుండగా.. మెుదటి స్థానంలో చైనా నిలిచింది. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో వెదురును ఆకుపచ్చ బంగారం అని పిలుస్తుంటారు. దీనిని ఫర్నిచర్ నుంచి పేపర్ ఉత్పత్తి వరకు అనేక అవసరాలకు వినియోగిస్తుంటారు. ఈ మెుక్కలను నాటిన నాలుగేళ్ల తర్వాత లాభాలను చూడటం రైతులు ప్రారంభిస్తారు. తక్కువ పెట్టుబడితో పాటు ఎలాంటి పురుగుమందులు దీని సాగులో లేకపోవటం రైతులకు కలిసొచ్చే అంశం.
రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో చెట్టుకు రూ.120 వరకు సబ్సిడీని కూడా అందిస్తోంది. ఈ బ్యాంబూ చెట్లను ఒక్కసారి నాటితే ఏకంగా 40 ఏళ్ల వరకు దిగుబడిని పొందవచ్చు. ఈ చెట్లలో అనేక జాతులు ఉన్నాయి. ఒక హెక్టారులో వెదురు పెంపకం చేస్తే రైతు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. సారవంతం కాని భూముల్లో కూడా వీటిని పెంచుకోవచ్చు. అయితే ముందుగా వీటిని సాగుచేస్తున్న రైతులను కలవటం ద్వారా మెళకువలతో పాటు సాగుకు సంబంధించిన అనేక ఆసక్తికమైన విషయాలను తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications