Business Ideas: లక్షలు కురిపించే మెుక్కలు.. ఒక్కసారి సాగుతో రూ.10 లక్షలు ఆదాయం
Business Ideas: దేశంలో పరిస్థితులతో పాటు రైతుల ఆలోచనలు కూడా మారాయి. ఒకప్పుడు కేవలం సాంప్రదాయ పంటల సాగుకు మాత్రమే పరిమితమైన అన్నదాతలు ఇప్పుడు రూటు మార్చి వాణిజ్య పంటలతో లాభాలను ఆర్జిస్తున్నారు.
ఈ క్రమంలో మంచి వ్యాపార ఆలోచనలతో రైతులు అలోవెర సాగు వైపు మెుగ్గు చూపుతున్నారు. కలబంద మెుక్కలు వాటి ఔషధ గుణాల కారణంగా కేవలం సౌందర్య ఉత్పత్తులోనే కాక వైద్యానికి సంబంధించిన వాటిలో కూడా వినియోగిస్తున్నారు. దీంతో కలబందకు కేవలం దేశీయ మార్కెట్లలో మాత్రమే కాక అంతర్జాతీయ మార్కెటలో మంచి డిమాండ్ ఉంది. ఇది కచ్చితంగా రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

పురాతన కాలం నుంచి కలబందను ఆయుర్వేదంలో చికిత్సలకు వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతే కాకుండా తక్కువ శ్రమ, నిర్వహణలతో సాధారణ వ్యవసాయ పంటల కంటే ఎకరానికి ఎక్కువ లాభాన్ని పొందేందుకు కలబంద సాగు అవకాశం కల్పిస్తోంది. దీని మూలం దక్షిణ ఐరోపా, ఆసియా లేదా ఆఫ్రికాలోని పొడి ప్రాంతాలలో ఉన్నట్లు చెబుతుంటారు. ఇయితే ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు.
అలోవెరా సాగు చేయటానికి చాలా తక్కువ నీరు అవసరం ఉంటుంది. అందువల్ల దీనిని అన్ని ప్రాంతాల్లో సులువుగా పెంచవచ్చు. ఈ పంట సాగుకు 20 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత అనుకూలమైనది. ఈ మొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలదు. వాణిజ్య పరంగా IC - 111271, IC - 111280, IC - 111269, IC - 111273 రకాల కలబంద వేరియంట్ల సాగు ఉత్తమ దిగుబడిని అందిస్తుంది. పైగా దీని సాగుకు తక్కువ ఎరువులు అవసరం ఉంటుంది. హెక్టారుకు 10-15 టన్నుల పశువుల వ్యర్థాలు వేయటం మంచిది.
సాగు ప్రారంభించిన నాలుగో నెల నుంచి దిగుబడిని రైతులు పొందుతారు. సాగులో డ్రిప్ ఇరిగేషన్ వాడుతూ మెుక్కల చుట్టూ నీరు నిలిచిపోకుండా చూసుకోవటం ముఖ్యం. ఒక ఎకరం భూమిలో 60 వేల వరకు మెుక్కలను నాటుకోవచ్చు. దీనికి సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు ఉంటుంది. దీంతో దిగుబడి అమ్మటం ద్వారా రూ.10 లక్షలను రైతులు పొందుతారు. అంటే పెట్టుబడిపై 5 రెట్లు రాబడిని పొందుతారు.


Click it and Unblock the Notifications