Business Ideas: ఈ టమాటా పండిస్తే ఎకరానికి రూ.2 లక్షలు లాభం.. పూర్తి వివరాలు..
Business Ideas: ప్రస్తుతం టమాటా వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. రోజుకో రికార్డుతో దూసుకుపోతూ.. డబుల్ సెంచరీకి దగ్గరకు చేరుకుంది. మార్కెట్లో చాలా కూరగాయల ధరల పరిస్థితి ఇలాగే ఉంది.
సొంతంగా వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలి, వ్యవసాయాన్ని అధునిక పద్ధతులతో ఉపాధిగా మార్చుకోవాలనుకునే వారికి సరైన ఆలోచన ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది నల్ల టమాటా సాగు గురించే. ఎరుపు టమోటాల తర్వాత.. ప్రస్తుతం బ్లాక్ టమాటాలు కూడా మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఈ బ్లాక్ టమాటా ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.

అనేక వ్యాధుల నుంచి పోరడటానికి సహకరిస్తుంది కాబట్టి యూరోపియన్ మార్కెట్లో దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. ఇండిగో రోజ్ రెడ్, పర్పుల్ టమాటా విత్తనాలను క్రాస్ చేయడం ద్వారా ఈ కొత్త బ్లాక్ రకం విత్తనం సృష్టించబడింది. పైగా నల్ల టమాటా సాగుకు భారతదేశంలోని వాతావరణం చాలా బాగుంటుందని వెల్లడైంది. ఈ రకమైన టమోటా సాగుకు వేడి వాతావరణం ఉత్తమంగా పరిగణించబడుతుంది. అలాగే సాగు చేసే భూమి pH 6-7 మధ్య ఉండాలి.
ఎరుపు టమాటాతో పోల్చితే నల్ల టమాటా దిగుబడి ఆలస్యం అవుతుంది. వీటి సాగును ప్రారంభించటానికి జనవరి సరైనది. రైతులు మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో దిగుబడిని పొందవచ్చు. ఔషధ గుణాలు అధికంగా ఉండే ఇవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి. నల్ల టమాటా సాగు ద్వారా రైతులు హెక్టారుకు రూ.4-5 లక్షల వరకు లాభాన్ని పొందవచ్చు. వీటిని ప్యాకింగ్ చేసి బ్రాండింగ్ చేయటం వల్ల రైతులు మంచి లాభాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications